క్రైమ్/లీగల్

గంజాయి కేసులో పదేళ్ళు జైలు, రూ.లక్ష జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 5: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితునిపై నేరం రుజువు కావడంతో పది సంవత్సరాలు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కరిమి సాయి మల్లేశ్వరరావు అనే వ్యక్తి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని గుంటూరు జిల్లా తాడేపల్లిలో విక్రయించేందుకు తరలిస్తుండగా సమాచారం అందుకున్న సత్యనారాయణపురం పోలీసులు 2017 ఆగస్టు 18వ తేదీన భానునగర్ జంక్షన్ వద్ద దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆటోతో సహా 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా నేరం రుజువైంది. న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.