క్రైమ్/లీగల్

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్తకు జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 5: అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్తకు జీవిత ఖైదు, మూడు వేల రూపాయలు జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా ముదినేపల్లి పెయ్యేరు గ్రామానికి చెందిన బొల్లు రాజేష్ (40) ఇదే గ్రామానికి చెందిన తిరుపతమ్మను 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెళ్లయిన కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆమెను అనుమానిస్తూ తరచూ వేధింపులకు గురి చేసేవాడు. భర్త వేధింపులు భరించ లేక తిరుపతమ్మ తన పుట్టింటికి వెళ్లిపోయి నాలుగు సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలో 2015 జూలై 4వ తేదీన భార్య వద్దకు వెళ్లిన భర్త తనతో కాపురానికి రమ్మనగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన రాజేష్ కత్తితో ఆమెపై దాడికి యత్నించాడు. స్థానికులు సర్ది చెప్పి ఆమెను కాపురానికి పంపారు. ఆ రోజు రాత్రి బాగానే ఉన్నా మరుసటి రోజు 5వ తేదీన భార్యతో గొడవ పడడంతో ఆమె తిరిగి పుట్టింటికి వచ్చేసింది. ఆరోజు సాయంత్రం తిరిగి భార్య వద్దకు వచ్చిన రాజేష్ తనతో కాపురానికి రావాలని గొడవపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో ఆగ్రహించిన రాజేష్ అందుబాటులో ఉన్న పచ్చడి బండతో ఆమె తలపై కొట్టగా ఆమె మరణించింది. ఘటనపై కేసు నమోదు చేసిన ఉంగుటూరు పోలీసులు నిందితుడు రాజేష్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరఫున పోలీసులు ప్రవేశపెట్టిన పదిమంది సాక్షులను విచారించారు. నిందితునిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై తీర్పు చెప్పారు.