క్రైమ్/లీగల్

అర్హత డాక్యుమెంట్లపై మీ వైఖరి చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ విషయంలో పేరు లేని వారు తమ అర్హతపై పది డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్‌ను చూపించే విషయమై కేంద్రం తన వైఖరిని తెలియచేయాలని సుప్రీంకోర్టు కోరింది. కేంద్రం వైఖరి తెలియచేసే వరకు ఈ రిజిస్టర్‌పై అభ్యంతరాలను తెలియచేసేందుకు ప్రారంభించే ప్రక్రియను కోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అస్సాం ఎన్‌ఆర్‌సి కో ఆర్డినేటర్ ప్రతీక్ హాజీరాను ఇచ్చిన నివేదికను కోర్టు స్వీకరించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ జాతీయ పౌర రిజిస్టర్ ఇచ్చిన నివేదికను తమకు కూడా ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో కేంద్రం ఎక్కువ ఆసక్తికనపరుస్తోందని, కాని నివేదిక ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈవిషయంలో కోర్టు బ్యాలెన్స్‌గావ్యవహరిస్తుందని ధర్మాసనం పేర్కొంది.
ప్రాణాన్ని డబ్బుతో వెలకట్టలేం..
ప్రాణం విలువైనదని, డబ్బుతో వెలకట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. లైంగిక దాడులు, దౌర్జన్యానికి గురైన కేసుల్లో బాధితులకు నష్టపరిహారం చెల్లింపునకు సంబంధించి దాఖలైన కేసును విచారి స్తూ కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసులో పిటిషనర్ల తరఫున మహిళా న్యాయవాదివాదనలు వినిపిస్తూ రేప్,గ్యాంగ్ రేప్‌తో పాటు ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలకు సం బంధించి కేసులను వర్గీకరించి పరిహారమిచ్చే పద్ధ తి వద్దని కోరారు. అన్నికేసులను ఒకే విధంగా పరిగణించాలన్నారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని ఐపీసీ వివిధ నేరాలకు వివిధ నిర్వచనాలు ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేసింది. మహిళా న్యా యవాది వాదనలు వినిపిస్తూ, యాసిడ్ దాడులకు గురైన మహిళలకు ఉద్యోగాలు లభించడంలేదని, వారి సమస్యల పరిష్కారానికి సరైన యంత్రాంగం లేదని తెలిపారు. నేషనల్ లీగల్ సర్వీసస్ అథారిటీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, యాసిడ్ బాధితులకు ప్రత్యేకంగా నష్టపరిహారం చెల్లించే స్కీం ఉందని తెలిపారు. అనంతరం కోర్టు ఈ కేసు ను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.