క్రైమ్/లీగల్

ట్యాంకర్‌ను ఢీకొన్న కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొంపిచర్ల, ఫిబ్రవరి 25: గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరప్పాడు గ్రామ సమీపంలో అద్దంకి - నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన మరో తొమ్మిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. పిడుగురాళ్లకు చెందిన ఓ కుటుంబం కారులో తిరుపతి వెళ్లి దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. మండలంలోని అన్నవరప్పాడు వద్దకు రాగానే రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను వారు ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. ఈ దుర్ఘటనలో పొత్తూరి రోహిత్(14), మాన్యత(5) అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స కోసం తరలిస్తుండగా పొత్తూరి ఝాన్సీ(40) మృతి చెందింది. కొదమగుండ్ల మోతీ(40) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గాయపడిన మరో తొమ్మిది మందిని చికిత్స కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. నరసరావుపేట డిఎస్పీ కె నాగేశ్వరరావు, రూరల్ సీఐ ప్రభాకర్, నకరికల్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్యాంకర్ లారీని రోడ్డుపై నిలిపి ఉంచటమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

చిత్రం..రోడ్డుపై నిలిచి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొనటంతో ధ్వంసమైన కారు