క్రైమ్/లీగల్

అప్పుల భారం.. మరణశాసనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 5: ఆర్థికభారం ఒక కార్మికుడి కుటుంబంలో తీరని విషాదం నింపింది. తల్లీకొడుకు బలవన్మరణానికి ప్రేరేపించింది. స్థానిక పర్సాల వీధిలో నివాసం ఉంటున్న గంగాధర్ (26) తిరుమల టీటీడీ లగేజీ సెంటర్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత 11 సంవత్సరాల క్రితం తండ్రి శ్రీనివాసులు మరణించడంతో కుటుంబ భారాన్ని మోసే బాధ్యతలను స్వీకరించి ఎనిమిదేళ్ల క్రితం టీటీడీలో ఔట్‌సోర్సింగ్ కార్మికుడిగా తిరుమలలోని టీటీడీ లగేజ్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం దివ్య (22)ను వివాహం చేసుకున్నాడు. ఈ సందర్భంగా వివాహ ఖర్చుల కోసం అప్పులు చేశాడు. అయితే పెళ్లి కోసం చేసిన అప్పులు, చాలీచాలని జీతాలు, సకాలంలో అందని వేతనాలతో గంగాధర్ మానసిక సంఘర్షణకు గురై బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనను జీర్ణించుకోలేని తల్లి కుమారుడి మృతదేహంపై పడి కన్నీరు, మున్నీరుగా విలపించింది. వెంట వచ్చినవారు, కుటుంబ సభ్యులు అక్కడ ఉండగానే, మృతుడి తల్లి కుమారి అక్కడ నుంచి క్యాజువాలిటీకి ఎదురుగా చెట్లున్న ప్రాంతానికి వెళ్లి తన చీర కొంగుతో చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.