క్రైమ్/లీగల్

భయం గుప్పెట్లో శంఖవరం ఎస్సీ కాలనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, సెప్టెంబర్ 7: శంఖవరంలోని ఎస్సీ కాలనీలో గురువారం జరిగిన జంట హత్యల నేపథ్యంలో ఎస్సీ కాలనీవాసులు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. ఊహించని రీతిలో జరిగిన ఈ హత్యల ఘటనలతో ప్రజలు భీతావహులయ్యారు. ఎక్కడ చూసినా వీధులు నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. కాలనీలో శాంతిభధ్రతల నేపధ్యంలో పోలీస్ పికెట్లు కొనసాగిస్తుండగా, 144 సెక్షన్ అమల్లో ఉండటంతో వీధులన్నీ పోలీసుల పహారాతో కన్పిస్తున్నాయి. జంట హత్యలకు గురైన బత్తిన నూకరాజు, బత్తిన ప్రసాద్‌ల మృతదేహాలకు శుక్రవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతుల బంధువులు, స్నేహితులు ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రి ఎదుట ధర్నా చేసి, హత్యకు కారణమైన నిందితులందరినీ అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనితో ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు ఆందోళనకారులతో చర్చించి, కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని, హత్యకు కారణమైన నిందితులెవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తిలేదని, త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీనితో మృతదేహాలను మృతుల బంధువులు శంఖవరం తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. శంఖవరం ఎస్సీ కాలనీలో పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకట రామారావు నేతృత్వంలో సీఐలు అద్దంకి శ్రీనివాసరావు, చెన్నకేశవరావు, ఎస్సైలు పార్ధసారధి, జగన్మోహనరావు, అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.
పోలీసుల అదుపులో 14మంది నిందితులు
శంఖవరం ఎస్సీ కాలనీలో గురువారం మధ్యాహ్నం జరిగిన జంట హత్యల కేసులో ఇప్పటికే 14 మందిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలినవారి కోసం గాలింపు చేపడుతున్నట్టు ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
రక్తకణాలు పడిపోయి మహిళ మృతి
విఆర్‌పురం, సెప్టెంబర్ 7: మండలానికి చెందిన మడివి జగదాంబ(45) అనే మహిళ తెల్లరక్తకణాలు పడిపోయి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం పండువారిగూడెం గ్రామానికి చెందిన జగదాంబ స్థానిక రేఖపల్లి గ్రామంలోని తన కూతురు పాయం రమాదేవి వద్ద గత కొంత కాలంగా ఉంటుంది. మృతురాలికి పదిరోజుల క్రితం జ్వరం రావటంతో రేఖపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నందిచినప్పటికి జ్వరం తగ్గక పోవటంతో భద్రాచలం, అక్కడి నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈక్రమంలో తెల్లరక్తకణాలు 15వేలకు పడిపోయి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.
భయపెడుతున్న ద్విచక్ర వాహనాలు!
మితిమీరిన వేగంతో ప్రమాదాలు: రామచంద్రపురంలో పాదచారుల ప్రాణాలకూ నో గ్యారంటీ
రామచంద్రపురం, సెప్టెంబర్ 7: రాకెట్లను తలపించే వేగంతో దూసుకుపోతున్న ద్విచక్ర వాహనాలు, ఆటోలు రామచంద్రపురం పట్టణవాసులను భయకంపితులను చేస్తున్నాయ. ఒకే బైక్‌పై ముగ్గురి ప్రయాణాలు, అతి వేగానికి తోడు డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్లు మాట్లాడటం వంటి చర్యల కారణంగా రోజు రోజుకు ప్రమాదాలు పెరిగిపోతున్నాయ. ఈ వేగం కారణంగా పాదచారుల ప్రాణాలకు సైతం గ్యారంటీ లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయ. లైసెన్సు అర్హత కూడా లేనివారు యువకులను ఇష్టారాజ్యంగా నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. మితిమీరిన వేగంతో గుండెలవిసేలా భారీ హారన్లు మోగించడం, సైలెన్సర్లు తీసేసి ఇష్టమొచ్చిన రీతిలో నడపడం నిత్యకృత్యమైపోయంది. ఇంటి నుంచి బయలుదేరినవారు తిరిగి గుమ్మం మెట్టు ఎక్కగలమో లేదోనన్న భయాందోళనతో రామచంద్రపురం ప్రజానీకం గత కొద్దికాలంగా ఉన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు అమితోత్సాహంతో హైస్పీడు బైక్‌లను కొనిచ్చి ప్రమాదాలకు పరోక్ష కారకులవుతున్నారు. రామచంద్రపురం పట్టణంలో వేగ నియంత్రణ బోర్డులు లేవు. ఒకవేళ ఉన్నా వాటిని పాటించే వారున్నారా అన్నది సందేహమే. రామచంద్రపురం పట్టణంలో ప్రధాన రహదారిపై వాహనాలు నడిచే పరిస్థితిని పోలీసు, రవాణ శాఖ అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలన చేయాలని ప్రజలు కోరుతున్నారు. చట్టాలున్నప్పటికీ వాటిని అమలు చేసేందుకు తగిన సిబ్బంది కొరవడటంతో అడ్డూ అదుపూలేని విధానంలో వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ప్రధాన రహదారి సీసీ రోడ్డుగా మార్పు చెందడంతో వాహనదారులు మితిమీరిన వేగంతో యథేచ్ఛగా తమ వాహనాలను నడపటం రివాజుగా మారింది. గేర్లు కలిగిన వాహనాలకు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకునేందుకు అర్హత కూడా లేని వయస్సు కలిగిన వారు కూడా వాహనాలతో రహదారిపై అతివేగంగా వెళుతున్నారు.
ఇక రామచంద్రపురం పట్టణంలో పోలీసుల సంఖ్య ఉండాల్సిన సంఖ్య కన్నా తక్కువగా ఉండటం, రహదారి నియంత్రణ చేసే సిబ్బంది కరువవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ప్రజలు పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోవడం గమనార్హం. ప్రముఖుల పర్యటనల కోసం అరకొరగా ఉండే స్థానిక సిబ్బందిని జిల్లా అధికారులు బందోబస్తు విధులకు పంపడంతో పోలీసుస్టేషన్‌లో ఇద్దరో, ముగ్గురో కానిస్టేబుళ్లు ఉండే పరిస్థితి ఏర్పడింది. జిల్లా ఉన్నతాధికారులు రామచంద్రపురంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియంత్రణ, అతివేగ చోదక నిరోధం చర్యలను చేపట్టేందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.