క్రైమ్/లీగల్

మున్సిపల్ వర్కర్స్ నాయకుడు జీవరత్నం ఆకస్మిక మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 7: సీఐటీయూ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్థానిక మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడు రేలంగి జీవరత్నం(50) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. గత 20 రోజులుగా సంత మార్కెట్‌లో విశ్రాంతి భవన నిర్మాణ స్థలంలో ఆందోళన చేస్తున్న జీవరత్నం అక్కడే కుప్పకూలిపోయాడని, తోటి కార్మికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారని సీఐటీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు షేక్ సుభాషిణి, వంగా గోపి, వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు చల్లారి మాణిక్యాలరావు తెలిపారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కార్మికుడు రేలంగి జీవరత్నం మృతి చెందాడని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట మృతదేహంతో యూనియన్ నేతలు ధర్నా చేపట్టారు. 2011లో పారిశుధ్య కార్మికుల విశ్రాంతి భవనం కోసం అప్పటి పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి ఈ స్థలాన్ని కేటాయించగా, ఇప్పుడు అధికారులు అడ్డుకున్నారని, ఈ వ్యవహారంపై గత నాలుగు రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొందని, దీనిపై కమిషనర్ అధికారికంగా స్థలానికి ఫెన్సింగ్ వేయించి ఇస్తామని హామీ ఇచ్చారని, అయినప్పటికీ సమస్య కొలిక్కి రాకపోవడంతో ఆందోళనతో జీవరత్నం గుండెపోటుతో మృతిచెందాడని పేర్కొన్నారు. అక్కడికి చేరుకున్న మాజీ సర్పంచ్, వైసీపీ జిల్లా నేత మండవల్లి విజయసారథి (సోంబాబు), కౌన్సిలర్ ముప్పిడి వీరాంజనేయులు జీవరత్నం మృతికి సంతాపం తెలిపి కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సోంబాబు మాట్లాడుతూ తమ పాలకవర్గం సంతమార్కెట్‌లో పారిశుద్ధ్య కార్మికులకు స్థలం కేటాయిస్తూ తీర్మానం చేసిందని, తమ తీర్మానాలన్నీ అమలు చేస్తున్న ప్రస్తుత మన్సిపల్ పాలకవర్గం ఈ తీర్మానం ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. మృతుని కుటుంబానికి తక్షణ సహాయంగా 20వేల రూపాయలు అందించారు. మున్సిపల్ కమిషనర్ తరఫున టౌన్‌ఫ్లానింగ్ అధికారి ఎ లక్ష్మీనారాయణ ఆందోళనకారులతో చర్చలు జరిపారు.వారం రోజుల్లో చర్చించి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ధర్నా విరమించారు.