క్రైమ్/లీగల్

ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమ్‌గల్, సెప్టెంబర్ 7: భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడాభీమ్‌గల్‌కు చెందిన ఎం.హర్షిణి అలియాస్ అఖిల(22) అనే నవ వధువు కాళ్ల పారాణి కూడా ఆరకముందే కాటికి పయనమైంది. వివాహం జరిగిన పది రోజులకే బలవన్మరణానికి పాల్పడింది. భీమ్‌గల్ సీఐ సైదయ్య కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. అఖిలకు గత పది రోజుల క్రితం వివాహం జరుగగా, అప్పటి నుండి ముభావంగానే ఉంటూ వస్తోందని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. ఈ క్రమంలోనే పుట్టింటికి వచ్చిన అఖిల గురువారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం ఆమె శవమై వేలాడుతుండడాన్ని చూసిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అఖిల ఆత్మహత్యకు గల కారణాలు ఇంకనూ వెల్లడి కాలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు.

చోరీ కేసులో నిందితుల అరెస్టు
నవీపేట, సెప్టెంబర్ 7: గత నెల 23వ తేదీన మండలంలోని అభంగపట్నం గ్రామంలో గల సాయరెడ్డి ఇంట్లో జరిగిన చోరీ ఘటనకు సంబంధించి నిందితులను అరెస్టు చేశామని సౌత్ రూరల్ ఇన్‌చార్జి సీఐ జగదీష్ తెలిపారు. శుక్రవారం నవీపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ, 23న సాయరెడ్డి ఇంట్లో చోరీ జరుగగా, 24వ తేదీన ఫిర్యాదు చేశారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుండగా, శుక్రవారం నవీపేట రైల్వేగేట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక యువకుడు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ జరిపామన్నారు. దీంతో సాయరెడ్డి ఇంట్లో చోరీ చేసిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు వచ్చినట్టు వారు అంగీకరించారని, నిందితుల నుండి పదిన్నర తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గతంలోనూ ఈ ముఠా బోధన్, మద్నూర్, రుద్రూర్, డిచ్‌పల్లి ప్రాంతాల్లోనూ చోరీలు చేశారని, పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయన్నారు. సదరు దొంగలు చిత్తుకాగితాలు ఏరుకునే వారిలాగా వీధుల్లో సంచరిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను పరిశీలించి, రాత్రి సమయంలో చోరీలకు పాల్పడతారని అన్నారు. కాగా, చోరీ కేసును ఛేదించిన ఎస్‌ఐ నరేష్‌ను, సిబ్బందిని సీఐ అభినందించారు.