క్రైమ్/లీగల్

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగంచిప్రోలు, సెప్టెంబర్ 7: మతాంతర ప్రేమ వివాహానికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన సంఘటన మండలంలోని అనిగండ్లపాడులో శుక్రవారం జరిగింది. అనిగండ్లపాడుకు చెందిన షేక్ షాదిక్ నందిగామలోని జీడీఎంఎం ఇంజనీరింగ్ కళాశాల బిటెక్ చదువుతుండగా అదే గ్రామానికి చెందిన సాదం సంధ్య (21) పదవ తరగతి పూర్తి చేసి ఖాళీగా ఉంటోంది. ఇద్దరి ఇళ్లు పక్కపక్కన ఉండటంతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో ప్రేమజంట పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు గ్రామంలో ప్రైవేటు వైద్యశాలలో ప్రధమ చికిత్స నిర్వహిస్తుండగా సంధ్య మృతి చెందింది. సాదిక్‌ను మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. వీఆర్‌ఓ రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అవినాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.