క్రైమ్/లీగల్

కీలకాంశాలపై రాజకీయ నేతలు నిర్ణయాలు తీసుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: కొన్ని కీలక అంశాలపై రాజకీయనేతలు నిర్ణయాలు తీసుకోకుండా సుప్రీంకోర్టుకు బాధ్యతలు అప్పగించడం సబబు కాదని, పైగా కోర్టు విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పేర్కొనడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. స్వలింగ సంపర్కం నేరంగా భావించే ఐపీసీ 377 సెక్షన్ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోకుండా కోర్టు విచారణకు వదిలేశారని ఆయన అన్నారు. శనివారం ఇక్కడ రూల్ ఆఫ్ లా, రాజ్యాంగ ప్రజాస్వామ్యం అనే అంశంపై నేషనల్ లా వర్శిటీ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం స్వలింగ సంపర్కాన్ని నిషేధించే ఐపీసీ సెక్షన్ 377ను కొట్టివేసిన విషయం విదితమే. రాజకీయ నేతలు కొన్నిసార్లు కొన్ని అంశాలపై తాము నిర్ణయం తీసుకునే అధికారాన్ని కోర్టుకు ఎందుకు అప్పగిస్తారని ప్రశ్నించారు. సెక్షన్ 377 విషయంలో కూడా కేంద్రం ఈ సెక్షన్‌ను రద్దు చేయాలా, కొనసాగించాలా అనే విషయమై కోర్టు నిర్ణయానికి వదిలేస్తున్నామని పేర్కొందన్నారు. ఈ కేసు తీర్పులో కోర్టు వ్యక్తిగత హుందా, గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వ్యక్తిగత అభీష్టాన్ని గౌరవించామన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వాలని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కోర్టులపై ఉందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛలో చట్టబద్ధమైన గౌరవాన్ని కోరుకుంటారని, దానిని పరిరక్షించాల్సిన అవసరం న్యాయస్థానంపై ఉందన్నారు. ఒక పురుషుడు లేదా మహిళ చట్టబద్ధంగా ఎలా ఉండాలో, పరస్పర సమ్మతితో ఎలా వ్యవహరించాలో చట్టం నిర్దేశించరాదన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా చట్టాలు ఉండరాదన్నారు. రాజ్యాంగపరమైన హక్కులకు భంగం కలిగిస్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయన్నారు.