క్రైమ్/లీగల్

ఐదో తరగతి విద్యార్థినికి లైంగిక వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాసోర్, సెప్టెంబర్ 8: కంచే చేనుమేసిన చందంగా పాఠశాలలో ఐదో తరగతి చదివే చిన్నారిపట్ల ప్రధానోపాధ్యాయుడే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసులు అందజేసిన వివరాల మేరకు గత గురువారం ఒడిస్సా రాష్ట్రం బాలాసోర్ జిల్లాలోని నీల్గిరిలో ఘటన చోటుచేసుకుంది. విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో బాధితురాలి తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దురాగతంపై ఆగ్రహోదగ్రులైన గ్రామస్థులు పాఠశాలకు వెళ్లి నిందితుడిని ఘెరావ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సనాఆటాగ్రామానికి చెందిన బాధిత విద్యార్థిని తన తరగతి గదిలోవుండగా తన గదిని శుభ్రం చేయాలంటూ పిలిచిన ప్రధానోపాధ్యాయుడు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అనుకోని ఘటనకు ఖిన్నురాలైన చిన్నారి హెడ్మాస్టారి చర్యలను తిరస్కరించడంతో జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ హెచ్చరించాడని బాధితురాలి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనతో భయపడిన బాధిత బాలిక ఒక రోజు ఆలస్యంగా శుక్రవారం విషయాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో శనివారం పోలీసులను ఆమె తండ్రి ఆశ్రయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ నిందితుడు తమనూ భయపెట్టాడని బాలిక తల్లిదండ్రులు ఈ సందర్భంగా వాపోయారు. ఇదే తరహాలో రెండు రోజుల క్రితం మరో బాలిక పట్ల కూడా అనుచితంగాప్రవర్తించిన సంఘటన జరిగినా దానిపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని వారు చెప్పారు. పోలీసులతోబాటు, విద్యాశాఖ అధికారులు ఘటనపై విచారించిన మీదట ప్రధానోపాధ్యాయుడిని విదుల నుంచి తప్పించారు.