క్రైమ్/లీగల్

మరో ‘మల్టీలెవెల్’ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ గచ్చిబౌలి, సెప్టెంబర్ 8: సులభంగా డబ్బు సంపాదించాలనుకునే సామాన్యుడి మనస్తత్వాన్ని ఆసరాగా చేసుకొని ఎన్ని సంస్థ ఎన్ని రకాలుగా మోసగిస్తున్నా, కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.. బాధితులు పెరుగుతునే ఉన్నారు. తాజా సంఘటనలో ‘్ఫచర్ మేకర్ లైఫ్ కేర్’ గ్లోబల్ మల్టీలెవల్ సంస్థ దేశ వ్యాప్తంగా 50 వేల మందిని నిలువునా ముంచేసి రూ.1,200 కోట్లు స్వాహా చేసింది. సంస్థ సీఎండీ, భాగస్వామిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు వారినుంచి రూ.200 కోట్లను సీజ్ చేశారు. ఇంట్లో కూర్చుని నెలకు రూ.60,000 సంపాదించవచ్చని,... వచ్చిన లాభన్ని పెట్టుబడిగా పెడితే 20 నెలల్లో 10 లక్షలు వస్తుందని పత్రికల్లో ఆకర్షణీయ ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్న మాల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ నిర్వహకులను సైబరాబాద్ ఆర్ధిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు దేశ వ్యాప్తంగా 50 వేల మందిని పైగా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. మాల్టీలెవల్ మార్కెట్ వ్యాపారం మోసమని, నిర్వహకులు మాత్రమే బాగుపడాతారని, నమ్మి డబ్బు పెట్టినవారు మోసపోతారని, ఇలాంటి గొలుసు వ్యపారం నేరమని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో పలు కేసుల్లో తీర్పు చెప్పినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. కొందరు మోసగాళ్లు కొత్త రకం ముసుగులు వేసుకొని కుచ్చుటోపీ పెడుతున్నారు. ఇలాంటి నయాతరహా మోసానికి తెరలేపారు రాధే శ్యామ్ (33), అతని భాగస్వామి సుందర్ సింగ్ (30). ప్రధాన నిందితుడు రాధే శ్యామ్ చదివింది 7వ తరగతే. కానీ, గొలుసు వ్యాపారం సంస్థలో పనిచేసిన అనుభవంతో ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ గ్లోబల్ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా యాభై వేలమందికిపైగా ప్రజల మంది నుండి సుమారు రూ.1,200 కోట్ల రూపాయల మేర మోసం చేశాడు. సైబరాబాద్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి 200 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. హర్యానాకు చెందిన రాధే శ్యామ్, సుందర్ సింగ్ మూడు సంవత్సరాల క్రితం మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థపై భారీ ప్రకటనలు ఇచ్చారు. రూ.7,500 చెల్లించి సంస్థలో సభ్యులుగా చేరితే రూ.2,500 తిరిగి ఇవ్వడంతో పాటు రూ.5,000 విలువ చేసే హెల్త్ ప్రొడెక్ట్స్ ఇస్తామని నమ్మించారు. సభ్యుడిగా చేరిన వారు మరో ఇద్దరిని చేరిస్తే ముందు చెల్లించిన ఐదు వేల రూపాయలు బోనస్‌గా ఇస్తామని ఎర వేశారు. ఈ స్కీమ్‌లో సభ్యులను చేరిస్తే నెలకు రూ.60,000 సంపాదించ వచ్చని, 20 నెలల తరువాత ఆదాయం పది లక్షలకు చేరుతుందని మోసపురిత ప్రకటనలు గుప్పించారు. ప్రతి వారం సెమినార్లు, వీదేశీ పర్యటనలను ఆశగా చూపించి, మల్టీలెవల్ మార్కెట్ తరహాలో ఇబ్బడిముబ్బడిగా లాభాలు వస్తాయని ఆశ చూపించారు. కాగా, సభ్యులకు స్టార్, సిల్వర్, ప్లాటినం, గోల్డ్, ఎమిరాల్డ్, ప్లాటినం, డైమండ్, రాయల్ డైమాండ్, క్రోన్ డైమండ్, క్రోన్ అంబాసిడార్ స్టార్ రివార్డులను అందిస్తూ సభ్యులను మోసం చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు.

చిత్రం..నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సామగ్రిని పరిశీలిస్తున్న పోలీసులు