క్రైమ్/లీగల్

ఏజెన్సీలో రేవ్ పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంపచోడవరం, సెప్టెంబర్ 8: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం పేదరాతి గూడెంలోని గ్రీన్ హెల్త్ ఏ 1 రిసార్ట్స్ అండ్ టూరిజంలో జరుగుతున్న రేవ్ పార్టీపై శుక్రవారం అర్థరాత్రి రంపచోడవరం పోలీసులు దాడులు నిర్వహించారు. శనివారం రంపచోడవరం సీఐ వెంకటేశ్వర్లు ఇందుకు సంబంధించిన వివరాలను విలేఖర్లకు తెలియజేశారు. విజయవాడకు చెందిన 20మంది శుక్రవారం ఏ-1 రిసార్ట్స్‌కు వచ్చారు. రిసార్ట్స్ యజమాని రమణమహర్షి అలియాస్ బుజ్జితో పార్టీ ఏర్పాట్ల కోసం మాట్లాడుకున్నారు. బుజ్జి విశాఖపట్టణానికి చెందిన ఎనిమిది మంది యువతులను రప్పించి రేవుపార్టీ ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులకు సమాచారం అందటంతో రిసార్ట్స్‌పై దాడి చేశారు. 20మంది వ్యక్తులను, 8మంది యువతులను, రిసార్ట్స్ యజమానిని అదుపులోనికి తీసుకున్నారు. వీరి వద్దనుంచి రూ.90వేలు నగదు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరిపై కేసు నమోదుజేసి సోమవారం కోర్టుకు హాజరుపర్చనున్నట్టు తెలిపారు. ఈ దాడిలో ఎస్సై విజయ్‌బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.