క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణుగూరు, సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని గుట్టమల్లారం గ్రామం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మణుగూరు మండలం పీవీ కాలనీకి చెందిన నల్లసాయి పవన్ (25), అరవింద్ (23), వసంత సాయి బైక్‌పై వెళుతుండగా బైక్ అదుపు తప్పి భద్రకాళి ఆలయం వద్ద ఉన్న సిమెంట్ పోల్‌కు ఢీకొనడంతో సాయి పవన్, అరవింద్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాల పాలైన వసంతసాయిని 108లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మణుగూరు సీఐ కోండ్రు శ్రీను తెలిపారు.