క్రైమ్/లీగల్

మానవ మృగాళ్ళు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 8: ఆ చిట్టితల్లికి తండ్రి లేడు.. ఇదే అదునుగా భావించారు కొంత మంది మానవ మృగాళ్ళు. ఆ బాలిక అవసరాలను పసిగట్టి స్వర్గలోకాలు చూపిస్తామంటూ నమ్మబలికారు. పెళ్లి చేసుకుని యువరాణిలా చూసుకుంటానని చెప్పాడు ఓ నయవంచకుడు. అసలే తెలిసీ తెలియని తనం.. ఏమి చేయాలో అర్థంకాక అక్కా ఇలా జరుగుతోందంటూ ఇరుగుపొరుగు మహిళలకు తన గోడు వెళ్లబోసుకుంది. అయితే తామూ మహిళలమనే ఇంగితం కూడా మరిచి చిన్నపిల్లను పడుపు వృత్తిలోకి పంపి సొమ్ము చేసుకోవాలని భావించిన ఆ మహిళలు నిందితులకే సహకరించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారం మేరకు.. గుంటూరు స్వర్ణ్భారతి నగర్‌కు చెందిన పదో తరగతి బాలికను స్థానిక యువకుడు చదలవాడ త్రినాథ్ ప్రేమ పేరుతో వంచించాడు. ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. ఈ విషయం తన మిత్రుడికి చెప్పటంతో ఇద్దరూ కలిసి బాలికను ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ దారుణాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి ఎవరికైనా చెబితే వీడియోలు బయటపెడతామని బెదిరించారు. ఈ విషయం తెలిసి అదే ప్రాంతానికి మరో ముగ్గురు బాలికను బెదిరించి అత్యాచారం చేశారు. ఏడాదిగా ఈ విషయం ఒకరి ద్వారా మరొకరికి తెలవటంతో బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. చదలవాడ త్రినాథ్, అతడి మిత్రుడు గత నెలలో బాలికను ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడకు తమ మిత్రులు మరికొందరిని రావాలని కబురు చేయటంతో భయపడిన బాలిక తప్పించుకుని ఇంట్లో వారికి విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లి గత నెల 29వ తేదీన నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో తొలుత ఏడుగురి పాత్ర ఉందని నిర్ధారించిన పోలీసులు, మరో 10 మంది పాత్ర ఉన్నట్లు తాజాగా భావిస్తున్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో రోజా అనే మహిళతో పాటు, నిందితులకు అసరా కల్పించడం, తన ఇంటిలోనే ఇదంతా జరిగేలా చేయడంలో కీలకపాత్ర పోషించిన సంధ్య అనే మహిళను నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఏడాదిగా నరకం..
బాధిత బాలికకు తండ్రి లేకపోవడంతో తల్లి చాటు బిడ్డగా బతుకుతోంది. అయితే అదే ప్రాంతంలో ఉండే వ్యక్తి యువరాణిలా చూసుకుంటానంటూ మభ్యపెట్టడంతో ఆ మాటలు నమ్మింది. చివరకు తాను నమ్మిన వాడే తన పాలిట యముడు అవుతాడని గ్రహించలేకపోయింది. ఏడాదిగా ఒక్కొక్కరు ఒక్కోలా నరకం చూపిస్తూ తనను మానసిక వేదనకు గురిచేస్తున్నా తాను నమ్మిన వాళ్లు కూడా మోసం చేయడంతో తనకు ఇంక అత్మహత్యే శరణ్యమంటూ రోదిస్తున్న తీరు వర్ణణాతీతం.
స్కూలుకు వెళుతున్నా నరకం చూపించిన వైనం..
బాధితురాలు స్కూలుకు వెళుతున్నా ఆ ప్రాంతంలో ఉండే ఆకతాయిలు పత్రికలో రాయలేని విధంగా అ విద్యార్థినితో ప్రవర్తించడం తీవ్ర మనోవేదనకు గురిచేసింది. నిందితులు తమ స్నేహితులందరికీ అసభ్యంగా చెప్పడంతో రోడ్డుపై వెళ్తున్న ప్రతీసారి బాలిక వెంటపడి వేధించేవారని తెలిసింది. ఏడాదికాలంగా ఆమె పట్ల వారు వ్యవహరించన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.
నల్లపాడు పోలీసులు పట్టించుకోలేదా?
బాధిత విద్యార్థిని గత నవంబర్ నెలలోనే తనపై అత్యాచారం చేస్తున్నారంటూ నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రెండుసార్లు బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేసినా రాజీ చేసి పంపించారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మరో పది మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి పాత్ర పై కూడా విచారణ చేసి నిర్ధారణ అయితే కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఇలా ఉండగా ఇప్పటికే అరెస్టైన రోజా కుటుంబ సభ్యులు కేసుతో రోజాకు ఏ సంబంధం లేకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం దుర్మార్గమని, అన్యాయం జరిగితే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ నగరంపాలెం పోలీసుస్టేషన్, వెస్ట్ డిఎస్‌పి కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించడం కొసమెరుపు.