క్రైమ్/లీగల్

టెంటుకర్ర ఊచ కంఠంలో దిగి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, సెప్టెంబర్ 9: తోటిపిల్లలతో సరదాగా ఆదివారం క్రికెట్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు టెంటు ఊచ కంఠంలోకి దిగడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం బొజ్జావారి తోటలో నివాసముంటున్న చిత్రాడ నాగ హర్షదీప్(13) స్థానిక భాష్యం పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా బ్యాటింగ్ చేస్తున్న హర్షదీప్ బంతిని కొట్టేందుకు ప్రయత్నించగా అది వేగంగా పక్కకు పోయింది. అయితే వికెట్ కీపర్ లేకపోవడంతో ఆ బంతిని పట్టుకునేందుకు బ్యాట్ వదిలి పరుగెత్తాడు. ఈక్రమంలో అక్కడ ఆటో నుండి షామియానాను కిందకి దింపుతున్నారు. అయితే బంతినే గమనిస్తూ పరుగెడుతున్న హర్షదీప్ కంఠంలో షామియానాలో ఉన్న టెంటు కర్ర ఊచ దిగిపోయింది. దీంతో అతడు కొట్టుమిట్టాడుతూ కొద్దిసేపటికే ప్రాణాలు వదిలాడు. ఘటన చూసి ఒక్కసారిగా స్నేహితులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అతడిని కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
హర్షదీప్ తండ్రి సత్తిరాజు గొల్లప్రోలు మండలం ఎకె మల్లవరం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై పిఠాపురం ఎస్సై పి శోభన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..కంఠంలో ఇనుప ఊచ దిగి మృతి చెందిన హర్షదీప్