క్రైమ్/లీగల్

నకిలీపాలను పట్టుకున్న రూరల్ పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, ఫిబ్రవరి 26: మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన ప్రసన్నాంజనేయరెడ్డి సుమారు మూడు సంవత్సరాల నుండి చుట్టుపక్కల గ్రామాల్లో పాలను కొని, కేంద్రానికి పోసి అమ్ముకుంటూ జీవిస్తుంటాడని డిఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే ఈ పాలపై వచ్చే లాభాలు తక్కువగా ఉండడం వల్ల నకిలీ పాలను తక్కువ ఖర్చుతో తయారుచేసి ఎక్కువ లాభానికి అమ్ముకునేందుకు నిర్ణయం తీసుకున్నాడని తెలిపారు. అందులో భాగంగా సంగం డెయిరీకి చెందిన పాలపొడి ప్యాకెట్లు, సన్‌రైజ్ రిఫైనరీ ఆయిల్, మిక్సీ, పాల క్యాన్లు కొనుగోలు చేసి, నకలీపాలను తయారు చేస్తున్నాడని తెలిపారు. 40 లీటర్ల పాలక్యానులో 35 లీటర్ల పాలను పోసి, అందులో పాలపొడితో తయారు చేసిన పాలను, నూనెను కలిపి మిక్సీలో వేసి, గ్రైండ్ చేసి, వాటిని ఒరిజనల్ పాలలో కలుపుతుండేవాడని వివరించారు. దాని వల్ల పాలలో శాతం ఐదు నుండి ఏడు శాతం వరకు పెరుగుతుందని, అలా రెండు శాతం పెరగడం వల్ల లీటరుకు ఐదురూపాయల లాభం వస్తుందని తెలిపారు. అలా ముద్దాయి ప్రసన్నాంజనేయరెడ్డి రోజుకు 400 లీటర్ల పాలు డెయిరీకి, నరసరావుపేట పట్టణంలోని కొంతమంది ప్రజలకు ఈ నకిలీ పాలు పోస్తుంటాడని డిఎస్పీ తెలిపారు. సుమారు సంవత్సరం నుండి ఈ నకిలీ పాలను విక్రయిస్తున్నాడని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఉప్పలపాడులో తన ఇంట్లో కింది అంతస్థులో నకిలీ పాలు తయారు చేస్తుండగా నరసరావుపేట రూరల్ ఎస్‌ఐ ఎం హనుమయ్య పోలీసులు పట్టుకున్నారని, దానికి సంబంధించిన వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. నకలీ పాల శాంపిల్స్‌ను పుడ్ ఇన్‌స్పెక్టర్‌కు, ల్యాబ్‌కు పంపించడం జరిగిందని అన్నారు.
గతంలో కూడా 2016 ఆగస్టులో కేసానుపల్లి పంచాయితీ పరిధిలోని కాశీలింగేశ్వరకాలనీలో నకలీ పాలు తయారు చేస్తున్న కొనికిపోగుల బాలకోటయ్య, శ్యామల శ్రీనివాసరెడ్డి, రాయన్న వెంకటేశ్వర్లు, మున్నా, గంగమ్మ (మార్కాపురం), వెన్నా శ్రీనివాసరెడ్డి (నరసరావుపేట) అనే వారిపై క్రైం నెంబర్ 154/2016,సెక్షన్ 420,272,336,34 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. వారి వద్ద 15 పాలక్యాన్లు, మిల్క్ పౌడర్ ప్యాకెట్లు 48, రిఫైనరీ ఆయిల్ 78ప్యాకెట్లు, 46ఖాళీ ప్యాకెట్లు, పది కేజీల పంచదార, నాలుగు కేజీల యూరియా, జగ్గు, మిక్సీని స్వాధీన పరుచుకున్నామని డిఎస్పీ వివరించారు. వీరిని కోర్టుకు హాజరుపర్చినట్లు తెలిపారు.