క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జామి, సెప్టెంబర్ 10: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యిక్తి దుర్మరణం పాలైన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జామి మండలం బలరామపురం గ్రామ సమీప జంక్షన్ వద్ద ఓమోటారు సైకిల్‌ను బలోరా వ్యాన్ ఎదురెదురుగా వచ్చి ఈ వాహనాలు ఢీకొన్నాయి. దీంతో మోటారు సైకిలిస్టు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మోటారు సైకిలిస్టు విజయనగరం పి. ఎస్. ఆర్. శ్రీనివాస్‌కాలనీకి చెందిన అలనేని గౌరీ శంకర్(55) అని తెలిసింది. విజయనగరం నుండి వస్తుండగా అలమండల సంత నుండి వస్తున్న బలోరా వ్యాన్ పశువుల లోడుతో వస్తూ ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిలిస్టు గౌరీశంకర్ తుళ్లి రోడ్డుపై పడిపోయాడు. తలకు, కాలుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణం
బలోరా వ్యాన్ డ్రైవర్ అతివేగమే కారణమని స్థానికులు తెలిపారు.
విషయం తెలుసుకున్న జామిపోలీస్ స్టేషన్ ఏ ఎస్సై కృష్ణ, హెచ్‌సి రాజు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వద్ద ఉన్న ఐడి కార్డు ఆధారంగా భార్యకు, హైదరాబాద్‌లో ఉన్న కుమారుడికి సమాచారం అందించారు.
మృతదేహాన్ని విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించి మృతిని కుటుంబానికి సమాచారం అందించారు. జామి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.