క్రైమ్/లీగల్

బైక్‌ను ఢీకొన్న కారు ఒకరికి తీవ్రగాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, సెప్టెంబర్ 10: ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు తీవ్రంగా గాయాలపాలై విషమపరిస్థితి నెలకొనగా, మరో వ్కక్తి స్వల్పగాయాలతో బైటపడ్డాడు. సత్తెనపల్లి- నరసరావుపేట చెక్‌పోస్టు వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వినాయక చవితిని పురస్కరించుకొని గణేష్‌ని విగ్రహాన్ని కొనుగోలుచేసి తీసుకెళ్లేందుకు అచ్చంపేట మండలం తాళ్ళచెరువు గ్రామస్థులు సత్తెనపల్లి వచ్చారు. నరసరావుపేట రోడ్డులో వున్న అమ్మకపుదారునివద్ద విగ్రహాన్ని కొనుగోలు చేసిన చామర్తి వీరయ్య (37) మల్లెల తిరుపతిరావు (27) ఆటోకోసం నరసరావుపేట అడ్డరోడ్డు వద్దగల చెక్‌పోస్టుదాటి ద్విచక్రవాహనంపై సత్తెనపల్లి పట్టణంలోకి వస్తుండగా పిడుగురాళ్ళ వైపు నుండి వేగంగా వస్తున్న కారు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీనితో తీవ్రగాయాలైన వీరిని స్థానికులు హుటాహుటిన సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనలో తిరుపతిరావు స్వల్పగాయాలతో బైటపడగా వీరయ్య పరిస్థితి విషమంగావున్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యంకోసం అతనిని గుంటూరు తరలించారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.