క్రైమ్/లీగల్

వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంబులపూలకుంట, సెప్టెంబర్ 10: మండల పరిధిలోని పీ.కొత్తపల్లి పంచాయతీ మల్లెంవారిపల్లి గ్రామానికి చెందిన డేరంగుల రామాంజులు (43) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మల్లెంవారిపల్లికి చెందిన రామాంజులు భార్య గతంలో మృతి చెందిందని, అతనికి ముగ్గురు పిల్లలు వుండడంతో కుటుంబ సమస్యలు కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక కుమార్తెకు పెళ్లి చేయడం జరిగిందని, కుమార్తె కుటుంబంలో చిన్నపాటి ఘర్షణలు జరుగుతుండడంతో మనస్థాపానికి గురైన తండ్రి రామాంజులు ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

శుభకార్యానికి వెళ్తూ...అనంత లోకానికి
* ఆర్టీసీ బస్సు- ఆటో ఢీ, ఇరువురు మృతి
* మరో ఇద్దరి పరిస్థితి విషమం

కదిరి, సెప్టెంబర్ 10: స్నేహితుని చెల్లెలు శుభకార్యానికి (వలిమా) వెళ్తుండగా ఆర్టీసీ బస్సు మృత్యురూపంలో వెంబడించి ఆటోను ఢీకొనడంతో మహబూబ్‌బాషా (21), మహమ్మద్ సిద్దిక్ (23)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కదిరి రూరల్ సీఐ మన్సూరుద్దీన్ తెలిపిన వివరాల మేరకు.. హిందూపురం పట్టణంలోని హుస్నాబాద్‌కు చెందిన నలుగురు యువకులు మహమ్మద్ సిద్దిక్ (కార్పెంటర్), మహబూబ్‌బాషా (ఆటో డ్రైవర్), రమేష్ (మెకానిక్), చాందు (ఆటో డ్రైవర్)లు తమ స్నేహితుని చెల్లెలు వలిమా శుభకార్యానికి హిందూపురం నుండి నల్లచెరువుకు ఆటోలో బయల్దేరారన్నారు. వలిమాకు వెళ్లిన ఆ యువకులు భోజనం అనంతరం కదిరికి తిరుగు ప్రయాణం చేస్తుండగా దేవరింటిపల్లి వద్ద కదిరి నుండి పలమనేరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును గమనించకుండా ఆటో ఉన్నపళంగా నల్లచెరువు వైపు యూటర్న్ తీసుకోవడంతో బస్సు ఆటోను ఢీకొంది. ప్రమాదంలో మహబూబ్‌బాషా, మహమ్మద్ సిద్దిక్‌లు మృతి చెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న రమేష్, చాందులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, రమేష్, చాందుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. సంఘటనా స్థలాన్ని కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి, రూరల్ సీఐ మన్సూరుద్దీన్, ఎస్‌ఐ రమేష్‌బాబులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మిద్దె పైనుండి పడి బేల్దారి మృతి

కదిరి, సెప్టెంబర్ 10: పట్టణంలోని హిందూపురం రోడ్డులో వున్న పార్థసారథి కాలనీలో ఇంటి నిర్మాణంలో భాగంగా కట్టెలు కడుతూ మిద్దె పైనుండి పడి గంగాధర్ (48) అనే బేల్దారి సోమవారం మృతి చెందాడు. అడపాల వీధికి చెందిన గంగాధర్ బేల్దారిగా పనిచేస్తూ, సెంట్రింగ్ కట్టెలు కడుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో-ద్విచక్ర వాహనం ఢీ * ఇద్దరికి గాయాలు

ధర్మవరం, సెప్టెంబర్ 10 : మండల పరిధిలోని బడన్నపల్లి గ్రామ సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు , పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆత్మకూరు మండలం శింగంపల్లి గ్రామానికి చెందిన రామాంజినేయులు, మహేష్‌లు అనంతపురం నుండి దిచక్ర వాహనంలో ధర్మవరం వైపు వస్తున్నారు. వారికి ఎదురుగా ధర్మవరం నుండి వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో రామాంజినేయులు తలకు బలమైన గాయాలు అయ్యాయి. దీంతో అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ అనిల్‌కుమార్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వస్తున్న 104 వాహన వైద్య సిబ్బంది గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేశారు. ఈ సంఘటనపై రూరల్ ఎస్‌ఐ గోపాలుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.