క్రైమ్/లీగల్

దైవ దర్శనానికి వచ్చి తిరిగివెళుతూ.. దంపతులు ఆనంతలోకాలకు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, సెప్టెంబర్ 10: కల్లూరు-పీలేరు జాతీయ రహదారి వెంకటదాసరపల్లి పంచాయతీ చెరుకువారిపల్లి బస్‌స్టాప్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్న ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన భార్యాభర్త మృతి చెందగా ఒకరు స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడినట్లు కల్లూరు ఎస్‌ఐ విశ్వనాధనాయుడు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు... తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు ఉప్పల్ సమీపంలోని రాజశేఖర్ కాలనీకి చెందిన వెంకటశాస్ర్తీ (50), ఆయన భార్య రాజ్యలక్ష్మీ (42), అన్న కుమార్తె సౌమ్య (21), అన్న శ్రీనివాస్, వదిన శైలజతో కలిసి రెండు కార్లలో హైదరాబాద్ నుండి వచ్చి ఆదివారం తిరుమల స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆదివారం ఉదయం కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకుని తిరిగి హైదరాబాదు వెళ్తూ మార్గ మధ్యంలో ఉన్న కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు బయలుదేరారు. వెంకటశాస్ర్తీ, ఆయన భార్య రాజ్యలక్ష్మీ, అన్న కుమార్తె సౌమ్యను తన కారులో ఎక్కించుకొని ముందుగా బయలుదేరగా అన్న శ్రీనివాస్, వదిన శైలజ వెనుకారులో బయలుదేరారు. కల్లూరు సమీపంలోని చెరుకువారిపల్లి బస్‌స్టాప్ సమీపంలో ఎదరుగా వస్తున్న బస్సు కారు ఢీకొన్న ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జు నుజ్జు కావడంతో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వెంకటశాస్ర్తీ, ఆయన భార్య రాజ్యలక్ష్మీ కారులో ఇరుక్కుపోయారు. సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న తారుప్లాంటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో కారులో ఇరుక్కున్న వారిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో గ్యాస్ కట్టర్ సహాయంతో కారులో ఇరుక్కున్న దంపతులను బయటకి తీయగా అప్పటికే దంపతులిద్దరూ మృతి చెందారు. వెనుక సీటులో ఉన్న సౌమ్య స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడగా చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తమ్ముడు వెంకటశాస్ర్తీ వెళ్తున్న కారును అనుసరిస్తూ వస్తున్న మృతుడి అన్న శ్రీనివాస్ తమ్ముడి కారు ప్రమాదాన్ని గుర్తించి అక్కడికి చేరుకోగా తమ్ముడు, మరదులు మృతదేహాలుగా కనిపించడంతో అన్న, వదిన కన్నీరుమున్నీరయ్యారు. మృతి చెందిన వెంకటశాస్ర్తీని మరిదిగా కాకుండా బిడ్డలా చూశానని, ఇప్పుడు మృతదేహంలా చూడటం దారుణమని మృతుడి వదిన శైలజ కన్నీటిపర్యతమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కల్లూరు ఎస్‌ఐ విశ్వనాధనాయుడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.