క్రైమ్/లీగల్

తప్పుడు అఫిడవిట్ అవినీతి చర్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలుచేస్తే సూత్రప్రాయంగా దాన్ని అవినీతి చర్యగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. అయితే ఈ రకమైన తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసే వ్యక్తులను పోటీకి అనర్హులుగా ప్రకటించేందుకు ఓ చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటును ఆదేశించేందుకు మాత్రం నిరాకరించింది. ఎన్నికల సమయంలో తాము దాఖలు చేసే అఫిడవిట్ల విషయంలో సదరు అభ్యర్థులు నీతి నిజాయితీలకు నిజాలకు, దాపరికం లేని తనానికి కట్టుబడి ఉండాలని, అయితే ఈ విషయంలో తప్పుడు వివరాలను దాఖలు చేసే అభ్యర్థులపై చర్యలు తీసుకునే విషయంలో ఓ చట్టాన్ని తీసుకురావాలని మాత్రం పార్లమెంటును తాము ఆదేశించజాలమని న్యాయమూర్తులు ఎస్.ఏ.బాబ్డే, ఎల్. నాగేశ్వరరావులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ఈ తాజా పిటిషన్‌ను ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నవాటితో జత చేస్తే సంయుక్తంగానే వీటిని విచారిస్తామని వెల్లడించింది. నైతికంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఇచ్చే వివరాలు వారి చిత్తశుద్ధికి అద్దం పట్టాలన్న విషయంలో తాము ఏకీభవిస్తున్నామని, వాటిని అంతే నిజాయితీతో పరిగణించాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నామని స్పష్టం చేసిన న్యాయమూర్తులు చట్టాన్ని తెచ్చే విషయంలో మాత్రం పార్లమెంటును ఆదేశించజాలమని తెగేసి చెప్పారు. అలాగే ఈ చర్యను అవినీతి చర్యగా పరిగణించాలన్న దానిపైనా చర్యలు తీసుకోవాల్సింది పార్లమెంటేనని తేల్చిచెప్పారు. బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు తప్పుడు వివరాలను ఎన్నికల కమిషన్ ముందు, ప్రధాన ఎన్నికల అధికారి ముందు దాఖలు చేసే పక్షంలో ఎలాంటి చర్య తీసుకోవాలన్న దానిపై దృష్టి పెట్టాలని, వీటిని కూడా ఎన్నికల సంస్కరణల్లో భాగంగా పరిగణించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నందున తప్పుడు అఫిడవిట్ల విషయంలో కోర్టు దృష్టి పెట్టాలని, ఇలాంటివారిపై రెండేళ్ల కారాగారశిక్షను విధించేలా కేంద్రాన్ని కోరాలని ఆయన కోర్టుకు నివేదించారు. అలాగే ఈ తప్పుడు చర్యకు పాల్పడే వ్యక్తిని పోటీనుంచి అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ తరపు న్యాయవాది రాణా ముఖర్జీ కోర్టును అభ్యర్థించారు.