క్రైమ్/లీగల్

అటవీ సిబ్బందిపై దాడికి స్మగ్లర్ల్ల యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధారి, సెప్టెంబర్ 10: అక్రమంగా కలపను రవాణా చేయడానికి స్మగ్లర్లు సిద్ధంగా ఉన్నారన్న సమాచారం అందుకొన్న అటవీ శాఖాధికారులు వారిని అడ్డుకోవడానికి యత్నించగా దుంగడగులు వారి వాహనంతో ఢీకొట్టే ప్రయత్నం చేసిన వైనమిది. అయతే, స్మగ్లర్ల దాడి నుంచి అధికారులు తృటిలో తప్పించుకొన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని చద్మల్ తాండా శివారులో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గాంధారి అటవీశాఖ అధికారి సంజయ్ గౌడ్ కథనం మేరకు.. మండలంలోని చద్మల్ తాండా శివారులో డీసీఎం (ఎపి 9యు 8466) వాహనం నిలిచి ఉందని అందులో అక్రమంగా నిల్వ చేసిన కలప దుంగలను ఎక్కించి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న సమచారం రావడంతో ఎఫ్‌ఆర్వో సంజయ్ గౌడ్ సిబ్బందిని అలర్ట్ చేశారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగింది. గాంధారి ఎస్‌ఐ సత్యనారాయణకు తమకు సిబ్బంది అవసరం అని చెప్పడంతో అటవీ శాఖ అధికారులకు రక్షణగా నలుగురు కానిస్టేబుళ్లను పంపించారు. వారి సహాయంతో అటవీశాఖకు చెందిన జీపులో వారు చద్మల్ తాండా వరకు వెల్లగానే అధికారులు వస్తున్న విషయాన్ని గమనించిన దుండగులు అక్కడి నుండి వాహనంతో పారిపోతుండగా వారిని తాండా శివారు దాటి చాలా దూరం వెంబడించారు. దుండగులు వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే సమయంలో అటవీశాఖ అధికారుల వాహనాన్ని దుండగులు డీసీఎం వాహనంతో ఢీకొట్టే ప్రయత్నం చేయగా వారు ఈ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు.