క్రైమ్/లీగల్

మాదక ద్రవ్యాల కేసు ఫిబ్రవరికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: మాదకద్రవ్యాల కేసును సుప్రీంకోర్టు ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. మాదక ద్రవ్యాల నియంత్రణపై కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. దేశంలో మాదకద్రవ్యాల నియంత్రణకు జాతీయ విధానం రూపొందించడానికి కావల్సిన మార్గదర్శకాలను తయారు చేయాలని గతంలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్)ను ఆదేశించిన విషయం తెలిసిందే. మార్గదర్శకాలను రూపొందించేందకు మరింత సమయం కావాలని ఎయిమ్స్ తరపు న్యాయవాది దుష్యంత్ పరిషర్ ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. 12వారాలలోగా మార్గదర్శకాలతో కూడిన జాతీయ విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూ విచారణను వాయిదా వేసింది.