క్రైమ్/లీగల్

200 కిలోల గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 10: తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గూడూరు డీఎస్పీ రాంబాబు సోమవారం సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్‌లో విలేఖర్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానిక హోలిక్రాస్ కూడలి వద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా నెల్లూరు వైపు నుంచి తమిళనాడుకు వెళ్తున్న లారీ పోలీసులను చూసి వేగంతో వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అనుమానంతో లారీని వెంబడించి తనిఖీ చేయగా అందులో ప్లాస్టిక్‌గోతాలు కన్పించాయి. వాటిని పరిశీలించగా అవి గంజాయి అని తేలింది. దీంతో లారీని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
తమిళనాడు సేలం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు, రామలింగ అనే ఇద్దరు లారీలో విశాఖపట్నం నుంచి తమిళనాడు సేలంకు బస్తాలల్లో గంజాయిని వేసుకొని ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తున్నారు.
గత కొంతకాలంగా వీరు ఇదే పనిగా గంజాయిని తమిళనాడుకు తరలించి అక్కడ పెద్దవ్యాపారంగా చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. లారీలో ఉన్న 200కిలోల గంజాయితో పాటు లారీని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.10లక్షలు, లారీ విలువ రూ.10లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు.