క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు-కారు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్తూరు, ఫిబ్రవరి 26: ముందువెళుతున్న లారీని అధిగమించేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ చేసిన ప్రయత్నంలో ఎదురుగావస్తున్న కారును ఢీకొన్న సంఘటనలో నవ వధువు సహా ముగ్గురు మృతి చెందగా, నవ వరుడు సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతి చెందగా, మరో నలుగురు రుయాలో చికిత్స పొందుతున్నట్లు నారాయణవనం ఎస్‌ఐ దస్తగిరి చెప్పారు. సోమవారం నారాయణవనం మండలం తుంబూరు సమీపంలో చెన్నయ్ నుంచి తిరుమలకు వస్తున్న కారు, తిరుమలకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో డ్రైవర్ కన్నదాసన్ (23), నవవధువు అముదవల్లి (30) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడటంతో తిరుపతికి రుయాకు తరలించారు. చికిత్స పొందుతూ శకుంతల(56) మృతిచెందింది. తమిళనాడులోని విల్లుపురంకు చెందిన నవ వధువు అముదవల్లి తన భర్త ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు బయలుదేరారు. వివాహమైన తరువాత తిరుమలకు చేరుకుని స్వామి సన్నిధిలో తాళిబొట్టును మార్చుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే వారు కారులో వస్తుండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతి వేగం వారి ప్రాణాలను బలి తీసుకుందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరారైనట్లు ఎస్‌ఐ తెలిపారు.