క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెనే్నకొత్తపల్లి, సెప్టెంబర్ 11 : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని యర్రంపల్లి పెట్రోలుబంకు వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. రామగిరి సీఐ యుగంధర్, ఎస్‌ఐలు మహమ్మద్ఫ్రీలు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంగా రావడంతోపాటు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి గ్రామానికి చెందిన సైకిల్‌పై వెళ్తున్న గాలి శ్రీరామరెడ్డిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీరామరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అదేవిధంగా కారు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న అనిరుధ్ (8) కూడా ఘటన స్థలంలోనే మృతి చెందాడు. శ్రీరామరెడ్డి ఉదయం గ్రామం నుండి చెనే్నకొత్తపల్లికి సైకిల్‌పై పాలు తీసుకువెళ్ళేవాడు. రోజు మాదిరిగానే పాలు తీసుకువెళ్ళి తిరుగుపయనమయ్యాడు. అయితే గ్రామ సమీపానికి రాగానే వెనుకవైపు నుండి కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇరువురు మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అగ్నిప్రమాదంలో దుకాణం దగ్ధం
గోరంట్ల, సెప్టెంబర్ 11: మండల పరిధిలోని పాలసముద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ దుకాణం దగ్ధమయింది. దీంతో దాదాపు రూ. 2.50 లక్షల నష్టం సంభవించింది. పాలసముద్రంలోని నవీన్‌కుమార్ చిల్లర దుకాణంలో సోమవారం రాత్రి జరిగిన విద్యుదాఘాతం వల్ల దుకాణం దాదాపు కాలిపోయింది. రెండు ఫ్రిజ్‌లతోపాటు వినాయక చవితి పండుగ కోసం తెప్పించిన నిత్యావసరాలు దగ్ధమయ్యాయి. మంగళవారం ఉదయం దుకాణం తెరవడానికి వచ్చిన నవీన్‌కుమార్ కాలిపోయి ఉండటాన్ని చూసి లబోదిబోమన్నాడు. సుమారు రూ.2.50 లక్షల నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. సమాచారం అందగానే రెవెన్యూ, ట్రాన్స్‌కో అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించి బాధితుడితో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
గోరంట్ల, సెప్టెంబర్ 11: మండల పరిధిలోని పాలసముద్రం వద్ద రెండు మోటార్ బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్ర గాయాలకు గురైనట్లు ఎస్సై సుధాకర్‌యాదవ్ తెలిపారు. శెట్టిచిన్నయ్యపల్లికి చెందిన ఆనంద్ మంగళవారం మోటార్ బైక్‌లో హిందూపురం నుండి వస్తుండగా పాలసముద్రం నుండి ఎదురుగా వస్తున్న మోటారు బైక్ ఢీకొనడంతో ఆనంద్, నారాయణస్వామి తీవ్ర గాయాలకు గురైనట్లు తెలిపారు. వీరిని 108 అంబులెన్స్‌లో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.