క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వీ ఆర్ ఏ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్ ఎన్‌పేట, సెప్టెంబర్ 11: మండలంలోని గార్లపాడు వంశధార పునరావాస కాలనీ వీ ఆర్ ఏగా పనిచేస్తున్న యాగాటి లక్షుమమ్మ (73) అనే వృద్ధురాలు మంగళవారం ఏబీ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. వంశధార రిజర్వాయర్ నిర్మాణం మూలంగా తులగాం గ్రామం ముంపు కావడంతో మల్లిఖార్జునపురం సమీపంలో పునరావాస కాలనీలో నివసిస్తున్నారు. మల్లిఖార్జునపురం వద్ద రోడ్డు దాటుతుండగా సరుబుజ్జిలి నుంచి హిరమండలం వైపు వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో లక్షుమమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలికి భర్త చనిపోగా కుమారుడు ఉన్నారు. తల్లి మరణంతో కుమారుడు యాగాటి రాము రోదనలు పలువురిని కలచివేసింది. రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు సరుబుజ్జిలి ఎస్ ఐ అశోక్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టమ్ కోసం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.