క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీఎస్‌జెన్కో ఉద్యోగుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల, సెప్టెంబర్ 11: మండల పరిధిలోని ఎదురుగుట్టల వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల్వంచకు చెందిన ఇద్దరు జెన్కో ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో చింతా వెంకటేష్ (25), ప్రవీణ్ (23) మృతి చెందారు. వీరిద్దరూ తమ కారులో వెంకటాపురం వైపు వెళుతుండగా ఎదురుగుట్ట మలుపు వద్ద అదుపుతప్పిన వీరి కారు అక్కడవున్న వంతెనను ఢీకొని వాగులో పడిపోయింది. కారు నుజ్జు నుజ్జు కావడంతో ముందుకూర్చున్న వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే కారులో ప్రయాణిస్తున్న వీరి స్నేహితులు తెల్లం స్వాతి, రోష్ని గాయాలతో బయటపడ్డారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో అతికష్టంమీద బయటకు తీశారు. గాయాలైన యువతులిద్దరినీ చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు వెంకటేష్, ప్రవీణ్ టీఎస్ జెన్కోలో పని చేస్తున్నారు. వీరిలో ఒకరు పర్మినెంట్ ఉద్యోగి కాగా మరొకరు కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నట్టు తెలిసింది. స్థానిక పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టంకు పంపి కేసు దర్యాప్తు చేస్తున్నారు.