క్రైమ్/లీగల్

అర్చకుడి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 11: ఇంద్రకీలాద్రిపై గోశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక అర్చకుడు మంగళవారం ఉదయం శ్రీ మల్లికార్జున మహామండపంపై నుంచి దూకేందుకు ప్రయత్నం చేశారు. దుర్గగుడి దేవస్థానం ఆధ్వర్యంలోని ఘాట్‌రోడ్‌పై గోశాలలో మంగళపల్లి రామారావు అర్చకుని విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఒక భక్తుడు గోశాల వద్దకు వచ్చి ఆవుకు దండం పెట్టుకోనేందుకు ప్రయత్నిస్తుండగా అర్చకుడు రామారావు అతనిని పరుష పదజాలంతో దూషించారు. దీంతో ఆ భక్తుడు స్వయంగా ఈవోకు లిఖిత పూర్వకంగా అర్చకుడు రామారావుపై ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈవో వి కోటేశ్వరమ్మ ఈ విషయంపై రామారావును పిలిపించి విచారణ చేశారు. తర్వాత రామారావును దుర్గగుడి నుండి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ తరుణంలో రామారావు శ్రీ మల్లికార్జున మహామండపంపై నుండి కిందకు దూకేందుకు ప్రయత్నించాడు. అక్కడ సెక్యురిటీ సిబ్బంది రామారావును నిలిపి విషయాన్ని ఈవో దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీస్ అవుట్ స్టేషన్‌లో ఉన్న సిబ్బంది రామారావును వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేయకుండా కేవలం కౌనె్సలింగ్ చేసి పంపారు.