క్రైమ్/లీగల్

ఇద్దర్ని మింగేసిన చేపల చెరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదినేపల్లి, సెప్టెంబర్ 11: బ్రతుకు తెరువుకై ఊరుగాని ఊరు వచ్చి చేపల చెరువులో పడవపై మేత వేయడానికి వెళ్లి పడవ అదుపు తప్పి తిరగపడటంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ముదినేపల్లి మండలం వైవాక గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం చేపల చెరువులో చేపల మేత వేయడానికి పడవలో మేత బస్తాలతో కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన వలవల ఆనంద్ (21), పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం దొడ్డనపూడికి చెందిన ఇర్రింకి రాజు(20) చేపలకు మేత వేస్తుండగా రమేష్ అనే యువకుడు పడవను తోస్తున్నాడు. ఈ క్రమంలో చెరువు మధ్యకు పడవ వెళ్లే సరికి అదుపు తప్పింది. దీంతో ఆ పడవ మేతతో సహా తిరగపడటంతో మేత వేస్తున్న ఆనంద్, ఇర్రింకి రాజుపై మేత బస్తాలు పడటంతో ఊపిరాడక వారిద్దరూ మృతి చెందారు. పడవను తోస్తున్న యువకుడు రమేష్ వెంటనే ఈదుకుంటూ ఒడ్డు వచ్చి విషయాన్ని గ్రామస్థులకు తెలిపాడు. కుటుంబానికి ఆసరగా వచ్చిన ఇరువురు యువకులు మృతి చెందటంతో వారి తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. ఈ మేరకు ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.