క్రైమ్/లీగల్

రెండు ఇటాచీల దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, సెప్టెంబర్ 11: మండలంలోని తాటికోల్ గ్రామ వాగు నుండి ఇసుకను తరలించేందుకు వచ్చిన రెండు ఇటాచీలను మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాటికోల్ వాగు నుండి ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో గత రెండు నెలలుగా వాగు నుండి ఇసుకను తరలించేందుకు కాంట్రాక్టర్ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తమ వాగు నుండి ఇసుకను తరలిస్తే గ్రామం ఎడారిగా మారుతుందని భావించిన తాటికోల్ గ్రామస్థులు కాంట్రాక్టర్‌ను ఇసుకను తవ్వకుండా అడ్డుకుంటూ వస్తున్నారు.
ఇసుక తరలింపుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తాటికోల్ గ్రామస్థులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడంతో పాటు ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వాగు వద్ద టెంట్‌లు వేసి వంటావార్పులతో తీవ్ర నిరసన తెలిపారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కాంట్రాక్టర్ దేవరకొండ నుండి కొంత మంది కిరాయి వ్యక్తులను తీసుకొచ్చి ఇసుకను తరలించేందుకు యత్నించగా గ్రామ యువకులు అడ్డుకొని కాంట్రాక్టర్‌తో పాటు అతని అనుచరునిపై దాడి చేసి గాయపర్చారు. ఈ విషయమై రెండు రోజుల క్రితం కాంట్రాక్టర్ దేవరకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం వాగు సమీపంలో నిలిచి ఉంచిన రెండు ఇటాచీలను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేయడంతో అవి పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఈ విషయమై కాంట్రాక్టర్ పీ సూర్యప్రకాశ్ మంగళవారం దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో తాటికోల్ గ్రామానికి చెందిన 12 మంది యువకులపై పోలీస్‌లు కేసు నమోదు చేశారు.
ఇటాచీలను దగ్ధం చేయించిందే కాంట్రాక్టరే : గ్రామస్థుల ఆరోపణ
తాటికోల్ వాగు సమీపంలో గత మూడు నెలలుగా నిలిచి ఉన్న ఇటాచీలను దగ్ధం చేసిన ఘటనలో తమ ప్రమేయం లేదని ఇసుక కాంట్రాక్టరే ఇటాచీలను దగ్ధం చేసి పోలీస్ కేసులతో భయపెట్టి ఇసుకను తరలించుకునేందుకు యత్నిస్తున్నాడని తాటికోల్ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.