క్రైమ్/లీగల్

రోడ్డుపై పొగతో మూడు లారీలు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, ఫిబ్రవరి 26: ఒకదానికొకటి వరుసగా మూడు లారీలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయాలతో బయటపడిన సంఘటన సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగింది. సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వైపు బొగ్గులోడ్‌తో వెళ్తున్న టిప్పర్ కిష్టారం బిఇడి కళాశాల సమీపంలో రోడ్డుపక్క లారీ నిలిపి ఉండటంతో దానిని ఖ్రాస్ చేయబోగా ఎదురుగా మరో ఖాళీ బొగ్గుటిప్పర్ వచ్చి ఢీకొట్టింది. ఈ రెండు టిప్పర్లు రోడ్డుపైనే ఉండగానే కొద్దిక్షణాల వ్యవధిలో కరీంనగర్ నుంచి కాకినాడకు గ్రానైట్ రాయితో వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఒక్కసారిగా ఖాళీ బొగ్గు టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీపై ఉన్న గ్రానైట్ రాయి క్యాబిన్‌పైకి దూసుకువచ్చి కిందపడిపోయింది. దీంతో తమిళనాడులోని సేలంకు చెందిన గ్రానైట్ లారీ డ్రైవర్ సెల్వంరాజు(26) క్యాబిన్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. పెనుబల్లి మండలం ఉప్పలచెలక గ్రామానికి చెందిన బొగ్గులోడ్‌తో ఉన్న టిప్పర్ డ్రైవర్ నాదెండ్ల శ్రీనివాసరావు కాళ్ళకు తీవ్రగాయాలయ్యాయి, క్షతగాత్రుడిని సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి సిఐ ఎం వెంకటనర్సయ్య, పెనుబల్లి ఎస్సై జి నరేష్, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను సేకరించారు. మూడు లారీలు నడిరోడ్ల మీదే ఉండటంతో సత్తుపల్లి మండలం కిష్టారం నుంచి పెనుబల్లి మండలం లంకపల్లి వరకు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు, బస్సులు నిలిచిపోవటంతో సత్తుపల్లి సిఐ వెంకటనర్సయ్య జెవిఆర్ ఓసి నుంచి రెండు క్రేన్‌లను రప్పించి ప్రమాదానికి కారణమైన మూడు లారీలను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేయటానికి నాలుగు గంటల సమయం పట్టింది.
పొగతోనే ప్రమాదం
కిష్టారం బిఇడి కళాశాల సమీపంలో రాష్ట్రీయ రహదారి పక్కనే ఉన్న పొలంలో వరిగడ్డి కాలుతోంది. దీంతో విపరీతంగా వచ్చిన పొగ వల్ల ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ఎం వెంకటనర్సయ్య ఫైర్ స్టేషన్‌కు ఫోన్‌చేసి ఫైరింజన్‌ను తెప్పించారు. రోడ్డుపక్కన తగలబడుతున్న వరిగడ్డి మంటలను ఫైరింజన్ సిబ్బంది ఆర్పివేశారు.