క్రైమ్/లీగల్

మాక్లూర్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాక్లూర్, సెప్టెంబర్ 11: మాక్లూర్ మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య మాటమాట పెరిగి, కత్తులు దూసుకునే స్థాయికి చేరుకుంది. విషయాన్ని పసిగట్టిన కొందరు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పెను ప్రమాదమే తప్పింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న కొంతమంది వద్ద కత్తులు, తల్వార్లు, పంచ్‌లు లభ్యమైనట్లు మాక్లూర్ ఎస్‌ఐ సాయినాథ్ వెల్లడించారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఒక వర్గానికి చెందిన వారు నివాస ఇళ్ల వద్దకు చేరుకుని సిగరెట్లు తాగుతూ న్యూసెన్స్ సృష్టించడం, అక్కడి కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడంతో మొదలైన ఘర్షణ మైదానంలోకి వెళ్లి దాడులకు పాల్పడే స్థాయికి చేరుకుంది. తల్వార్లు, కత్తులు, పంచ్‌లతో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, ఘర్షణకు ప్రధాన సూత్రధారులైన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సాయినాథ్ వివరించారు. ఇన్‌చార్జ్ రూరల్ సీఐ జగదీష్ ఆధ్వర్యంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉండకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.