క్రైమ్/లీగల్

చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, సెప్టెంబర్ 11: తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని ధర్మసాగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారినుంచి రూ.5లక్షల రూపాయల విలువచేసే 160 గ్రాముల బంగారు అభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ధర్మసాగర్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకట్‌రెడ్డి మాట్లాడు తూ వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి ప్రాంతానికి చెందిన విద్యార్థి జనగాం పవన్‌సాయి, దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన దుగ్గొండి రాజేష్ అనే మరో విద్యార్థి ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. చెడు వ్యసనాలకు బానిసలుగా మారి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో చోరీలకు పాల్పడేవారు. దీంతో వరంగల్ పోలీ సు కమిషనరేట్ పరిధిలోని దుగ్గొండి, వేలేరు, సంగెం పోలీసు స్టేషన్ల పరిధిలో నాలుగు చోరీలకు పాల్పడ్డారు. ఉదయం 10 గంటలకు రాంపూర్ బస్‌స్టేషన్ వద్ద ధర్మసాగర్ సిఐ శ్రీలక్ష్మి పోలీసు సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా నిందితులు ఇద్దరిని అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడిన విషయాన్ని అంగీకరించారు. ఈ విలేఖరుల సమావేశంలో కాజీపేట ఏసీ పీ కె.సత్యనారాయణ, ధర్మసాగర్ సీఐ శ్రీలక్ష్మి, ఎస్సైలు విజయ రామ్‌కుమార్, వీరభద్ర పాల్గొన్నారు.