క్రైమ్/లీగల్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దోపిడీకి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దుర్తి, సెప్టెంబర్ 11: మండల కేంద్రమైన వెల్దుర్తిలోని సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో మంగళవారం నాడు తెల్లవారు జామున ఓ అగంతకుడు బ్యాంకు వెనుక భాగంలో గల ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను తోలగించి అందులోకి దూరిన అగంతకుడు బ్యాంకులో గదులన్నీ తిరిగి దోచేందుకు ఏమీ కనిపించక పోవడంతో అగంతకుడు తిరిగి వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై స్థానిక పోలీసులు తూప్రాన్ సీఐ లింగేశ్వర్ వచ్చి బ్యాంకులోని సీసీ పుటేజీలను క్షుణంగా పరిశిలించారు. సీసీ కెమెరాలను సరిగా బిగించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైన బ్యాంకులోకి వచ్చినా, అగంతకులు ఎవరైనా వస్తువును టచ్ చేస్తే బెల్ మోగేవిధంగా చూడాలని బెల్ మోగినట్లైయితే నేడు ఆ అగంతకుడు అందులోనే ఉండే వాడని సిఐ తెలిపారు. ఇప్పటికైనా అగంతకున్ని ముఖకవళికలను సరిగా గుర్తుపట్టే విధంగా లేవని తెలిపారు. ఈ సీసీ పూటేజీల ఆధారంగా అగంతకుడిని పట్టుకుటామని సీఐ తెలిపారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నామోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.