క్రైమ్/లీగల్

భార్య రావడం లేదని భర్త ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, సెప్టెంబర్ 11: పుట్టింటి నుంచి భార్య రావడం లేదన్న మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్లలో నివాసముండే వల్లెపు కృష్ణ (30) ఆటో డ్రైవర్. ఇతనికి 5 సంవత్సరాల క్రితం సావిత్రితో వివాహం జరిగింది. మూడు నెలలుగా సావిత్రి పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. మనస్థాపానికి గురైన కృష్ణ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ: ఒకరి మృతి
కీసర, సెప్టెంబర్ 11: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన కుందన్‌పల్లి గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కుందన్‌పల్లి గ్రామానికి చెందిన తుడుం నగేశ్ (32) చీర్యాల గ్రామం నుండి కుందన్‌పల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. ఎదురుగా అతి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో నగేశ్‌కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
అనుమానాస్పదస్థితిలో బీటెక్ విద్యార్థి మృతి
ఉప్పల్, సెప్టెంబర్ 11: అనుమానాస్పదస్థితిలో బీటెక్ విద్యార్థి మరణించాడు. డెంగ్యూ వ్యాధి వల్లే ఇతడు మరణించాడని స్థానికులు తెలిపారు. పీర్జాదిగూడ బుద్ధానగర్ రోడ్డు నెంబర్ 4లోని వజ్ర రెసిడెన్సీలో నివసిస్తున్న యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలోని చాడ మాజీ సర్పంచ్ రాజబోయిన యాదగిరి యాదవ్ కుమారుడు సాయి ప్రసాద్ (23) గండిపేటలోని సీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతుండగా మలక్‌పేట్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు.
పరీక్షలు చేయించగా ప్లేట్‌లేస్ పడిపోయి రక్తప్రసరణ లేక కోమాలోకి వెళ్లిపోయాడు. మెరుగైన చికిత్స చేయించినప్పటికీ సోమవారం రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దోమలు విజృంభిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నా నివారణ చర్యలు లేక అమాయక యువకులు బలవుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.