క్రైమ్/లీగల్

రోకలి బండతో మోది.. భార్యను హతమార్చిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 11: భార్య ప్రవర్తనపై విసుగుచెందిన భర్త రోకలి బండతో మోదీ హత్యచేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రామ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మంచిలీపట్నానికి చెందిన ప్రశాంత్, జోత్స్నలు భార్యభర్తలు. అధిక సమయం సామాజిక మాధ్యమాలలో గడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న భార్య తీరును మార్చుకోవాలని పలుమార్లు సూచించినా మార్పు రాలేదు. భార్య జోత్స్న అదే రీతిలో వ్యవహరించడంతో తీవ్రంగా కోపోద్రేకుడైన ప్రశాంత్ రోకలి బండతో తలపై బాది హత్య చేశాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. సంఘటన స్థలానికి ఏసీపీ కేఎస్ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం చేరుకొని విరవాలను సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కారు బోల్తా..వ్యక్తికి గాయాలు
కొత్తూరు రూరల్, సెప్టెంబర్ 11: కారు బోల్తాపడటంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నందిగామ ఎస్‌ఐ నర్సింహా రెడ్డి కథనం ప్రకారం.. సోమవారం రాత్రి 44వ బైపాస్ రహదారిపై హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బొల్తా పడటంతో శ్రీను (35) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. 108వాహనంలో షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కిషన్‌గూడ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి ఆత్మహత్య
వనస్థలిపురం, సెప్టెంబర్ 11: అనుమానాస్పద స్థితిలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలానికి చెందిన ఎం.డీ.ఖలీద్ (14) వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సామనగర్‌లోని ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
అనుమానాస్పద స్థితిలో సోమవారం రాత్రి హాస్టల్ పైఅంతుస్తులో ఉన్న గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.