క్రైమ్/లీగల్

అద్దెకు తీసుకున్న కార్ల విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 11: సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో కార్లను అద్దెకు తీసుకొని, అనంతరం వాటిని వైబ్‌సైట్ల ద్వారా ఇతరులకు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ ఘరానా మోసగాడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసు వివరాలను పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ కేఎస్ రావు, సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. కృష్ణాజిల్లా, విజయవాడకు చెందిన వంశీకృష్ణ గతంలతో వివిధ సంస్థల్లో పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. త్వరగా డబ్బు సంపాదించాలన్న దురుద్దేశంతో నగరంలోని వివిధ ప్రాంతాలవారి వద్ద నుంచి కార్లను అద్దెకు తీసుకొని వాటిని విక్రయిస్తానని వెబ్‌సైట్‌లో ప్రకటనలు ఇచ్చేవాడు. ఇది నిజమని నమ్మి సంప్రదించే వినియోగదారులకు కారు యజమాని తన సోదరుడని ఇటీవల ప్రమాదంలో మృతిచెందాడని, అతని పేరుపై ఉన్న డాక్యుమెంట్లను చూపించేవాడు.
బ్యాంకు లోన్లు ఇతర వివరాలను సంప్రదించగా నకిలీ ఎన్‌ఓసీలను సైతం వారికి పంపించేవాడు. ఈ మొత్తం వ్యవహారం పూర్తిచేసిన అనంతరం కారు అప్పగించేందుకు వచ్చిన సమయంలో 80 శాతం డబ్బు తీసుకొని మిగిలిన డబ్బు ఒర్జినల్ డాక్యుమెంట్లు ఇచ్చే సమయంలో తీసుకుంటానని చెప్పి వెళ్లిపోయేవాడు. తిరిగి డాక్యుమెంట్లు కోసం సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందించే వాడు కాదు. ఇలా మోసపోయిన ఓ మహిళ.. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు నెలలపాటు శ్రమించి ఘరానా మోసాలకు పాల్పడుతున్న వంశీకృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా తాను చేసిన మోసాలను ఒకొక్కటిగా వివరించాడు. ఈ తరహా మోసాలతో సుమారు రూ.30.25లక్షలు అక్రమంగా సంపాదించిన వంశీకృష్ణ ఐరు లక్షల వరకు అద్దె రూపంలో ఆయా కార్ల యజమానులకు చెల్లించినట్టు తెలిసింది. వంశీకృష్ణ వద్ద నుంచి నాలుగు కార్లు, రూ.2.98లక్షల నగదు, ఓ బ్యాంకు ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.