క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో మహిళా ఎస్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 11: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా ఎస్‌ఐ రాణి బక్కమంతుల గూడెంకు చెందిన రైతుల నుంచి 8 వేల రూపాయలు లంచం తీసుకుంటూ మంగళవారం రాత్రి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. సంఘటనా వివరాలు మహబూబ్‌నగర్ ఏసిబి డీఎస్పీ బిఎస్ కృష్ణగౌడ్ అందించిన వివరాల మేరకు మఠంపల్లి మండల బక్కమంతుల గూడెం గ్రామానికి చెందిన రైతులు పడిగపాటి ఓబుల్‌రెడ్డి, వెంకటరెడ్డి, పిచ్చిరెడ్డి, ఉక్కు వెంకటేశ్వర్లకు హుజూర్‌నగర్ మండల అమరవరం గ్రామంలో ఎకరం 10 కుంటల భూమి విషయంలో అదే గ్రామానికి చెందిన ఉప్పల వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణమూర్తి, శ్రీనివాసుల మధ్య వివాదం ఏర్పడింది. గత రెండు నెలల క్రితం ఈ ముగ్గురు రైతుల భూమి ఆక్రమించుకుని పైగా వారిపైనే హుజూర్‌నగర్ పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. ఈవిషయమై స్థానిక సీఐ నలుగురు రైతులను పోలీసుస్టేషన్‌లో బెయిల్ పొందమని సలహా ఇవ్వగా ఇటీవల బదిలీపై వెళ్లిన ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి స్థానంలో ఈ కేసును స్వీకరించిన నలుగురు రైతులను 12 వేలు లంచంగా ఇస్తేనే బెయిల్ ఇస్తానని డిమాండ్ చేశారు. దీనితో గత శనివారం వెంకటరెడ్డి, ఓబుల్‌రెడ్డి, పిచ్చిరెడ్డిలు ఏసీబీ అధికారులను కలిసి విషయం వివరించారు. ఈలోగా యస్‌ఐ రాణి 12 వేలకు బదులు 8 వేలు తెమ్మని డిమాండ్ చేయటంతో మంగళవారం వీరు నల్లగొండకు వచ్చి 8 వేలు ఏసీబీ అధికారులకు అందచేయటంతో వారు కరెన్సీకి రసాయనాలు కలిపి వీరికి తిరిగి ఇచ్చారు. మంగళవారం రాత్రి స్థానిక పోలీసుస్టేషన్ వెనుక ఎస్‌ఐ రాణికి వీరు 8 వేలు అందచేసిన అనంతరం వెంటనే దాడి చేసి ఆమెను అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ కృష్ణగౌడ్ చెప్పారు. రాణిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు రిమాండ్‌కు పంపుతున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈదాడిలో ఏసీబీ సీఐలు రఘుబాబు, లింగస్వామి, వెంకట్రావు, 15 మంది సిబ్బంది, పోరెన్సిక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రాలు.. పట్టుబడిన మహిళా ఎస్‌ఐ రాణి
* కేసు వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డిఎస్పీ బీఎస్ కృష్ణగౌడ్