క్రైమ్/లీగల్

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, సెప్టెంబర్ 12: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో శ్రీనివాసులు అనే నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఏఎస్పీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. చింతా శ్రీనివాస్ ఈ నెల 8న పట్టణంలోని జోగోనుకుంట వద్ద మైనర్ బాలికను తన టయోటా వాహనంలో ఎక్కించుకొని గొట్లూరు పరిసర ప్రాంతంలో ఉన్న వేరుశెనగ మిల్లుకు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అత్యంత రహస్యంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టామన్నారు. సీఐ హరినాథ్ ఆధ్వర్యంలో ఒక బృందం తన ఆధ్వర్యంలో మరో బృందం గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం మధ్యాహ్నం స్థానిక మార్కెట్ యార్డు వద్ద నిందితుడు పట్టణంలోకి వస్తున్నాడన్న సమాచారం తెలుసుకొని సీఐ హరినాథ్, ఎస్‌ఐ శ్రీహర్ష సిబ్బందితో అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారన్నారు. అదేవిధంగా టయోటా వాహనాన్ని సీజ్ చేశామన్నారు. నిందితుడిని కోర్టుకు హాజరుపరిచామన్నారు.

మద్యం సేవించి వ్యక్తి మృతి
మడకశిర, సెప్టెంబర్ 12: మండలంలోని మెళవాయికి చెందిన తిమ్మయ్య (38) అతిగా మద్యం సేవించి మృతి చెందాడు. మెళవాయికి చెందిన తిమ్మయ్య కూలి పనులు చేసుకొంటూ జీవనం సాగించేవాడు. భార్య పుట్టినింటికి వెళ్ళింది. దీంతో ఇంట్లో ఎవరూ లేరని అతిగా మద్యం సేవించి పట్టణంలోని వేణుగోపాలస్వామి దేవాలయ సమీపంలో ఇసుక దిబ్బలో పడిపోయాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు గమనించి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై గోపి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి ఆత్మహత్య
కుందుర్పి, సెప్టెంబర్ 12: మండల కేంద్రానికి చెందిన కురుబ శ్రావణ్ (25) కడుపునొప్పి బాధ తట్టుకోలేక బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసులు వివరణ మేరకు శ్రావణ్ గత 3 సంవత్సరాల నుండి కడుపునొప్పితో బాధపడుతుండేవాడని, బుధవారం తీవ్రతరం కావడంతో తన స్వంత పొలంలోనే చింత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.