క్రైమ్/లీగల్

బీటీపీఎస్‌లో ప్రమాదవశాత్తూ కార్మికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణుగూరు, ఫిబ్రవరి 26: భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో సోమవారం జరిగిన ప్రమాదంలో మరో కార్మికుడు మృతి చెందాడు. ప్రమాదంపై తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం బీటీపీఎస్‌లో ఎలక్ట్రో స్త్రాస్పపిక్ ప్రాస్పిటేటర్ (ఈఎస్‌పీ)ను సబ్ కాంట్రాక్టు కంపెనీ అయిన హార్జీ అనే సంస్థ నిర్వహిస్తోంది. హార్జీ సంస్థలో కార్మికుడిగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కల్కా గ్రామానికి నీమ్‌లేష్ (25) అనే కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. నీమ్‌లేష్ నడుముకు రక్షణ బెల్టు పెట్టుకుని 10 మీటర్ల ఎత్తులో ఉన్న ఈఎస్‌పీ కాలమ్స్‌కు వెల్డింగ్ చేస్తూ ఒక కాలమ్ నుంచి మరో కాలమ్‌కు వెళ్లే సమయంలో నడుముకు ఉన్న బెల్టు తీసి మరో బెల్టు హుక్ అందుకుంటుండగా పట్టుతప్పి 10 మీటర్ల ఎత్తు నుంచి కింద ఉన్న సెట్రింగ్ చెక్కపై పడ్డాడు. కిందపడిన నీమ్‌లేష్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం అయింది. వెంటనే అధికారులు, కార్మికులు మణుగూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సలహా మేరకు భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతి చెందిన నీమ్‌లేష్‌కు సబ్ కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్న హార్జీ కంపెనీతో పాటు బీటీపీఎస్ నుంచి న్యాయం చేస్తామని బీటీపీఎస్ సీఈ బాలరాజు పేర్కొన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో రక్షణ చర్యలు గాలికొదిలేసి కార్మికుల జీవితాలతో యాజమాన్యం చెలగాటమాడుతోందని కార్మికులు, పలు రాజకీయ సంఘాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. నీమ్‌లేష్ కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉద్ధృతమై అక్కడ ఉన్న కార్యాలయ అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. నీమ్‌లేష్ కుటుంబానికి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని కార్మికులు భీష్మించారు.