క్రైమ్/లీగల్

వివాహిత అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామిడి, సెప్టెంబర్ 12: మండల పరిధిలోని రామగిరి గ్రామంలో వివాహిత తిరుపతమ్మ (35) మృతి వివాదస్పదంగా మారింది. తిరుపతమ్మ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, సంసారం విషయంలో బార్య భర్తలు వాదులాడుకున్నారని ఈక్రమంలో భర్త వడ్డే సుధాకర్ ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేశాడని, మా అమ్మ కేకలు వేయటంతో పారిపోయాడంటూ బుధవారం మృతురాలి సోదరి వడ్డే నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతమ్మకు 15 ఏళ్ల క్రితం గార్లదినె్న మండలం కొప్పలకొండకు చెందిన వడ్డే సుధాకర్‌తో వివాహం జరిగింది. రెండుళ్లుగా సాఫీగా సాగిన వారి సంసారం తదనంతరం మనస్పర్దలు వచ్చి విడిపోయారన్నారు. రెండేళ్ల క్రితం వడ్డే సుధాకర్ పెద్దమనుషుల సమక్షంలో తిరుపతమ్మతో సక్రమంగా కాపురం చేసుకుంటానని కొప్పలకొండలో కాపురం పెట్టారని, నెల క్రితం తిరిగి భార్య భర్తల మధ్య మనస్పర్ధలు మొదలవ్వటంతో అక్క పుట్టింటికి వచ్చి తల్లి ఈశ్వరమ్మతో కలిసి ఉంటుందన్నారు. గ్రామానికి చెందిన హనుమంతు వచ్చి తిరుపతమ్మ ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని కొన ఊపిరితో ఉందని చెప్పటంతో వెంటనే అక్కడకు వెళ్ళి చూడగా అప్పటికే మృతి చెందిందన్నారు. మృతురాలి సోదరి నిర్మల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు.