క్రైమ్/లీగల్

రాయసీమలో మట్కాను రట్టు చేసిన అనంత పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 12: సామన్య పేద వర్గాల బతుకులను చిద్రం చేస్తూ రాయలసీమ జిల్లాల్లో నిర్వహిస్తున్న మట్కాను అనంతపురం వన్‌టౌన్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు ప్రధాన మట్కా నిర్వాహకులతో సహా 20 మందిని అరెస్టు చేసి, వారి నుండి రూ.47 లక్షలు, ఒక కారు, రెండు ల్యాప్‌టాప్, 32 సెల్‌ఫోన్లు, ఒక ట్యాబ్, మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ బుధవారం పోలీసు కాన్ఫరెన్సు హాల్‌లో మట్కా గురించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మట్కా నిర్వహణలో అరెస్టయిన 20 మందిలో ముఖ్యులైన తాడిపత్రి టౌన్ పడమట వీధికి చెందిన కట్టపోడి సాదిక్ (40) బెంగళూరును కేంద్రంగా చేసుకొని రాయలసీమ జిల్లాలో అనంతపురం, కర్నూలు, కడప తదితర ప్రాంతాలలో మట్కా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని తెలిపారు. రోజు లక్షల్లో లావాదేవీలు ఉంటున్నాయని, రోజువారి టర్నోవర్ మొత్తాలను కర్ణాటకలోని హుబ్లీ, మహారాష్టల్రోని ముంబాయి మట్కా కంపెనీలకు పంపుతూ గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారని తెలిపారు. రెండవ ముఖ్యుడైన గుత్తికోటలోని ఖతీఫ్ వీధికి చెందిన హబీబ్ ఖాన్ (27) కూడా బెంగళూరు కేంద్రంగా చేసుకొని జిల్లాలోని తాడిపత్రి, గుత్తి, గుంతకల్, బత్తలపల్లి, కదిరి, కడప, కర్నూలు జిల్లాల్లో మట్కా నిర్వహిస్తున్నాడని తెలిపారు. ఈ మట్కాను రూపుమాపడానికి ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన జిల్లా పోలీసులు రాబడిన సమాచారం మేరకు వీరిని అరెస్టు చేశారని తెలిపారు. ఈ మట్కా నిర్వాహుకులను అరెస్టు చేసిన సీఐలు విజయభాస్కర్ గౌడ్, హమీద్‌ఖాన్, శ్రీరాంల ఆధ్వర్యంలో ఏఎస్‌ఐలు రాజశేఖర్, వెంకటకృష్ణ, రమేష్, అమర్, వెంకటేసు, శ్రీ్ధర్, పీసీలు చంద్రశేఖర్, జయరాం, శివ, ఆనంద్, గిరి, చంద్ర, రామకృష్ణ, నాగరాజు, విజయ్, కుళ్ళాయప్పల బృందాన్ని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అభినందించారు.