క్రైమ్/లీగల్

ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) సెప్టెంబర్ 12: చెడు వ్యసనాలకు బానిసలై ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను గుంటూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వారి వద్ద నుంచి 4 లక్షల రూపాయల విలువచేసే 8 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రూరల్ పోలీసులు బుధవారం వెల్లడించారు. జిల్లాలోని గురజాలకు చెందిన రుద్రాల సురేష్, సిరంశేట్టి రమేష్, షేక్ సుబాని, మంచికృష్ణ, జక్కా మహేష్‌లు ముఠాగా ఏర్పడి బస్టాండ్, సినిమాహాళ్లు, మద్యం దుకాణాల వద్ద కాపు కాసి ద్విచక్ర వాహనాలను తస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే గురజాలకు చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. వీరు దొంగిలించిన 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన పోలీసులను రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు అభినందించారు.