క్రైమ్/లీగల్

దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) సెప్టెంబర్ 12: అర్బన్ పరిధిలో ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సిసియస్ పోలీసులు తెలిపారు. బుధవారం సిసియస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అదనపు ఎస్పీ రాఘవ కేసు వివరాలను వెల్లడించారు. గత కొంత కాలంగా అర్బన్ పరిధిలో ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్పీ విజయారావు ప్రత్యేకంగా దృష్టిపెట్టి కొన్ని బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే అరండల్‌పేట పోలీసులు సాధారణ వాహనాల తనిఖీల్లో గుంటూరు నల్లచెరువు ప్రాంతానికి చెందిన జామీ గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతను దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించాడని తెలిపారు. ఆయన 2015లో భారత్‌పేటలోని ఇంట్లో దొంగతనానికి పాల్పడి బంగారు వస్తువులు దోచుకెళ్లినట్లు ఒప్పుకున్నాడన్నారు. అతని వద్ద నుంచి 2 చైన్లు, 2 ఉంగరాలు, 3 జతల పోగులు, 46 గ్రాములు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన అరండల్‌పేట పోలీసులను అర్బన్ ఎస్పీ విజయరావు అభినందించారు.