క్రైమ్/లీగల్

మధ్యప్రదేశ్ - మంగళగిరి - గుంటూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండట్‌పేట) సెప్టెంబర్ 12: ఏమీ తెలియని వ్యక్తుల్లా రోడ్ల వెంట, అపార్ట్‌మెంట్‌లలో అద్దెకు ఇళ్లు కావాలని తిరుగుతారు.. సాయంత్రానికి తమ పని కానిచ్చేస్తారు... ఎంత దొరికితే అంతా మొత్తం దోచుకుని తమ సొంత ప్రాంతానికి వెళ్లి జల్సాలు చేస్తారు. ఇదీ ప్రస్తుతం రాజధాని పరిధిలో సంచరిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా పని. వీరి గుట్టును రట్టు చేసిన గుంటూరు అర్బన్ పోలీసులు ఎంతో చాకచక్యంగా తెగువను ప్రదర్శించి నిందితులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం అర్బన్ ఎస్పీ విజయరావు మీడియాకు వెల్లడించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం జుహుబా గ్రామానికి చెందిన కొంత మంది యువకులు ముఠాగా ఏర్పడి రాష్ట్రంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిలో అదే గ్రామానికి చెందిన రసిత్‌రాహుల్, హబు, అనే యువకులతో పాటు మరో ముగ్గురు యువకులు గత కొంత కాలంగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే గత జూన్ నెలలో మంగళగిరిలోని కాజ గ్రామంలో విజేయం అపార్ట్‌మెంట్‌లో చోరీకి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితులను గుర్తించామన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు చాలా చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్‌పి ఈ సందర్భంగా అభినందించారు. వారి వద్దనుంచి 5 లక్షల రూపాయల నగదు, బంగారపు గొలుసు, రెండుపట్టిలు, దొంగతనాలకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
చోరిలు ఇలా చేస్తారు..
ఈ అంతరాష్ట్ర దొంగల ముఠా వారికి రాకపోకలకు అనువుగా ఉండే ప్రదేశాలను ముందుగానే ఎంచుకుంటారు. అనంతరం వారు అక్కడ సిద్ధపడి ఒకరోజు లేదా రెండు రోజుల్లోనే దోచేస్తారు. ఖాళీ ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు లక్ష్యంగా వారి వేట కొనసాగుతుంది. పెద్దగా కష్టపడకుండానే వారి వద్ద ఉన్న పరికరాలతో ఎంతో నైపుణ్యంగా అంతా దోచేసుకుని వెళ్తారని ఎస్పీ తెలిపారు.
గుంటూరు - మధ్యప్రదేశ్..
రాజధాని ప్రాంతం అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్న ఐజేయం విల్లాలో చోరి జరగడంతో అర్బన్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించి ఈ కేసును ఛేదించారు. గుంటూరు నుంచి మధ్యప్రదేశ్ వెళ్ళి అక్కడ దొంగలను పట్టుకున్న తీరు అభినందనీయమన్నారు. అక్కడి వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా ధైర్య, సాహసాలు తెగువ ప్రదర్శించిన పోలీసుల కృషి అమోఘమని ఎస్పీ అన్నారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన మంగళగిరి రూరల్ సిఐ సుబ్బారావు, సిసియస్ సిఐ, సురేష్‌బాబు, సిసియస్ సిబ్బంది వెంకటేశ్వర్లు యు శ్రీనివాసరావు, పిసి జానీ, ఐటి కోర్‌టీం బాలాజీలకు ఆయన క్యాష్ రివార్డ్‌లను అందించారు. ఇటువంటి దొంగతనాలకు నివారించేందుకు అధునాతన కెమేరాలను అపార్ట్‌మెంట్, వాణిజ్య దుకాణాల వద్ద ఏర్పాటు చేసుకోవాలని ఎస్‌పి విజయారావు సూచించారు.