క్రైమ్/లీగల్

మనస్థాపంతో యువకుని ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుపాం, సెప్టెంబర్ 12: తన ఉపాధి కోసం పెట్టుకున్న దుకాణాన్ని తొలగించమన్నందుకు మనస్థాపానికి గురై గిరిజన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు, బంధువులు అందించిన వివరాల ప్రకారం కురుపాం మోడల్ స్కూల్ గేటు బయట గడబంటి శ్రీనివాస్ అనే గిరిజన యువకుడు చిన్నపాటి దుకాణాన్ని నడుపుతున్నాడు. అయితే పాఠశాల ప్రిన్సిపల్ డివిఎస్ అరుణ దుకాణాన్ని తొలగించమని వేధింపులకు గురిచేయడంతో మనస్థాపం చెంది బుధవారం కిరోసిన్‌ను తాగాడు. వెంటనే బంధువులు చూసి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యసిబ్బంది ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని పలువురు పేర్కొంటున్నారు.