క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటగిరి, సెప్టెంబర్ 12: వెంకటగిరి సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డక్కిలి మండలం మోపూరు సొసైటీ అధ్యక్షుడు, టీడీపీ నేత బండి చంద్రారెడ్డి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. వెంకటగిరి నుంచి తన గ్రామమైన డక్కిలి మండలం మోపూరుకు తన స్నేహితుడు మాధవయ్యపాళెం నీటి సంఘం అధ్యక్షుడు జయరామిరెడ్డితో కలిసి మోటార్‌బైక్‌పై వెళుతుండగా తెలుగుగంగ కాలువ సమీపంలో ఉన్న ఎస్టీ కాలువ వద్ద ఓ మహిళ రోడ్డు దాటుతుండగా మోటార్‌బైక్ ఢీకొంది. దీంతో మహిళకు, మోటార్‌బైక్ వెనుక ఉన్న చంద్రారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడ్డ వారిని స్ధానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చంద్రారెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మహిళను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. టీడీపీ నాయకులు బండి చంద్రారెడ్డి మృతి చెందిన సమాచారం గ్రామంలో తెలియడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
రెడ్డి సంక్షేమ సంఘం సంతాపం
రెడ్డి సంక్షేమ సంఘం నేత, టీడీపీ నాయకులు, మోపూరు సొసైటీ అధ్యక్షుడు బండి చంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థానిక రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు కె చంద్రశేఖర్‌రెడ్డి, జి గోవర్దన్‌రెడ్డి, బి హరిరెడ్డి, ఎస్ భగవాన్‌రెడ్డి, పులి చంద్రశేఖర్‌రెడ్డి, పులి ప్రసాద్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. రెడ్డి సంక్షేమ సంఘం ఒక నేతను కోల్పోయిందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలిగాలని సూచించారు.