క్రైమ్/లీగల్

వెలుగొండ అడవుల్లో ఎక్సైజ్ అధికారుల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాపూరు, సెప్టెంబర్ 12 : రాపూరు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సర్కిల్ పరిధిలోని పంగిలి గ్రామ సమీంలో వెలుగొండ అడవుల్లో ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా పంగిలి గ్రామ సమీపంలోని గుట్టలు, కొండలు ఇతర దట్టమైన అటవీ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి 70 లీటర్ల నాటు ఊట కనపడటంతో దాన్ని నిశితంగా పరిశీలించి ఆనవాళ్లపై కూపీలాగారు. ఈ నాటు ఊట ఎవరిదై ఉంటుందన్న దానిపై సమీపంలోని పంగిలి గ్రామస్థుల ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం దాన్ని ధ్వంసం చేశారు. పంగిలి గ్రామ సమీపంలోని ప్రాంతాల్లో నాటు సారా తయారు చేస్తున్న సమాచారంతో బుధవారం ధ్వంసం చేసినట్లు గూడూరు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అసిస్టెంట్ సూపరిండెంట్ విజయ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాపూరు ఎక్సైజ్ పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేసినా, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డా ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ విధానాలకు లోబడే మద్యం వ్యాపారాలు జరగాలని, లేకపోతే కేసులు తప్పవని హెచ్చరించారు. సర్కిల్ పరిధిలో ఎక్కడైనా నాటుసారా తయారీ లేదా అమ్మకాలు జరిగినా తమకు సమాచారం అందించాలని వారు కోరారు. ఈ దాడుల్లో గూడూరు విజిలెన్స్ స్క్వాడ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కిషోర్‌బాబు, గూడూరు, వెంకటగిరి ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ప్రసాద్‌రెడ్డి, ద్వారకానాథ్‌రావులతోపాటు స్థానిక ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరావు, సబ్ ఇన్‌స్పెక్టర్ రమణ పాల్గొన్నారు.